శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (18:12 IST)

లైవ్‌లో గొడవ పెట్టుకున్న పాకిస్థాన్ యాంకర్లు.. వీడియో వైరల్

ఇద్దరు పాకిస్థాన్ యాంకర్లు లైవ్‌లో గొడవపెట్టుకున్నారు. ఆ లైవ్ కోట్లాది మంది ప్రజలు వీక్షిస్తున్నారన్న విచక్షణను కూడా విస్మరించి మరీ న్యూస్ చ‌దివే స‌మ‌యంలోనే గొడ‌వ‌ప‌డ్డారు.

ఇద్దరు పాకిస్థాన్ యాంకర్లు లైవ్‌లో గొడవపెట్టుకున్నారు. ఆ లైవ్ కోట్లాది మంది ప్రజలు వీక్షిస్తున్నారన్న విచక్షణను కూడా విస్మరించి మరీ న్యూస్ చ‌దివే స‌మ‌యంలోనే గొడ‌వ‌ప‌డ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. డైలీ పాకిస్థాన్ అనే న్యూస్ ఛానెల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వార్తలు చదువుతోన్న సమయంలో మధ్యలో చిన్న బ్రేక్ తీసుకున్నప్పుడు మేల్ యాంకర్‌.. ఫిమేల్ యాంకర్‌పై ఫైర్ అయ్యాడు. అయితే, బ్రేక్ పూర్తయినప్పటికీ కొన్ని సెకన్ల పాటు వారి మధ్య జరిగిన సంభాషణ లైవ్ న్యూస్‌లో వచ్చేసింది. మొత్తం 30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో నవ్వు పుట్టిస్తోంది. 'ఇటువంటి యాంకర్‌తో నేను ఎలా బులిటెన్‌ను కొనసాగించాలి?' అని మేల్ యాంకర్ అనగా, 'మాటలు సరిగ్గా రానీయ్' అని ఫిమేల్ యాంకర్ కస్సుమంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది