శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2017 (11:35 IST)

విద్యార్థితో టీచర్ లైంగిక సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు..

మైనర్ విద్యార్థితో లైంగిక సంబంధం జరిపిన వివాహిత టీచర్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన ఓక్లహామాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓక్లహామాలోని యాకూన్ హై స్కూల్‌లో సైన్స్ టీచర్‌గా

మైనర్ విద్యార్థితో లైంగిక సంబంధం జరిపిన వివాహిత టీచర్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన ఓక్లహామాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓక్లహామాలోని యాకూన్ హై స్కూల్‌లో సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్న హంటర్ డే(22) పనిచేస్తోంది. ఈమెకు ఇదే స్కూల్‌లో ఫుట్‌బాల్ కోచ్‌తో వివాహమైన్నట్లు తెలిసింది.
 
అయినప్పటికీ ఈమె గత కొంతకాలంగా మైనర్ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుంది. అయితే ఆ విద్యార్థి తల్లిదండ్రులు అనుకోకుండా అతడి మొబైల్ చూడటంతో విషయం బయటపడింది. సెక్స్ చాటింగ్, న్యూడ్ ఫోటోల షేరింగ్‌లను వారు విద్యార్థి ఫోనులో ఉండటాన్ని చూసి షాకయ్యారు. అంతేగాక ఇద్దరి మధ్య లైంగిక సంబంధాలు ఏర్పడినట్లు విద్యార్థి తల్లిదండ్రులు గుర్తించారు. 
 
దీంతో తమ కొడుకును హంటర్ డే లైంగికంగా వాడుకుంటోందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ విషయం తెలియని హంటర్ డే ఎప్పటిలానే విద్యార్థికి సందేశం పంపింది. విద్యార్థి కూడా వెంటనే స్పందించి, అనుకున్న సమయానికి హంటర్ డే ఇంటికి వెళ్లాడు. ఇద్దరూ శృంగారం జరుపుతున్న సమయంలో పోలీసులు టీచర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. 
 
టీచర్ నేరం రుజువు కావడంతో ఆమెకు 85,000 డాలర్ల జరిమానా పడింది. అలాగే హంటర్ డేను పాఠశాల యాజమాన్యం విధుల నుంచి తొలిగించింది. అంతేగాక టీచర్ చర్యను తప్పుబడుతూ ఓ లేఖను ట్విట్టర్‌లో పోస్టు చేసింది.