మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 15 నవంబరు 2017 (19:56 IST)

19 ఏళ్ల ఇండియన్ లండన్ కుర్రాడు... కానీ రూ. 100 కోట్లకు అధిపతి.. ఎలాగంటే?

తెలివనేది అందరికీ వుంటుంది. కానీ దాన్ని సరైన సమయంలో సరైన దారిలో వినియోగిస్తే ఎక్కడికో తీసుకువెళుతుంది. ఓ 19 ఏళ్ల యువకుడికి వచ్చిన చిన్న ఆలోచన అతడిని రూ. 100 కోట్లకు అధిపతిని చేసింది. ఎలాగో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. అతడి పేరు అక్షయ్. ఉత్తర లం

తెలివనేది అందరికీ వుంటుంది. కానీ దాన్ని సరైన సమయంలో సరైన దారిలో వినియోగిస్తే ఎక్కడికో తీసుకువెళుతుంది. ఓ 19 ఏళ్ల యువకుడికి వచ్చిన చిన్న ఆలోచన అతడిని రూ. 100 కోట్లకు అధిపతిని చేసింది. ఎలాగో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. అతడి పేరు అక్షయ్. ఉత్తర లండన్ నగరంలోని ఓ స్కూలులో చదువుతున్నాడు. ఐతే ఆ విద్యార్థి పేరు ఒక్కసారిగా బ్రిటన్ బిలయనీర్స్ జాబితాలో కనిపించింది. అతడి ఏడాది ఆదాయం 103.33 మిలియన్ రూపాయలంటూ అందులో పేర్కొన్నారు. దీనితో అంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎలా సాధ్యమైంది అని చూస్తే అప్పుడు కాని అసలు విషయం తెలియలేదు.
 
తను డోర్ స్టెప్స్ డాట్ యూకె అనే వెబ్ సైట్‌ను ప్రారంభించాననీ, అలా ప్రారంభించిన కొన్ని వారాలకే తనకు ఓ ఫోన్ కాల్ వచ్చిందని చెప్పాడు. తనకున్న కొద్ది భూమిని, ఇంటిని అమ్మిపెట్టాలంటూ సస్సెక్స్ అనే వ్యక్తి తనకు కాల్ చేశాడు. కానీ అతడి వద్దకు వెళ్లేందుకు తనకు ఎలాంటి వాహనం లేకపోవడంతో రూ.3,500 చెల్లించి అతడి వద్దకు చేరుకున్నట్లు చెప్పాడు. అక్కడికి వెళ్లి సుస్సెక్స్ ఇంటి స్థలం, ఇంటిని ఫోటోలు తీసి తన వెబ్ సైట్లో పెట్టాడు. ఇక అంతే వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకపోయింది. అలాఅలా అతడిని సంప్రదించేవారు పెరిగిపోయారు.

పని ఎక్కువైంది. ఉద్యోగులు కావలసి వచ్చారు. రిక్రూట్ చేశాడు. కానీ అతడి కార్యాలయానికి వెళ్లి చూస్తే అంతా పెళ్లయిన నడివయసు మహిళలే వుండటం గమనార్హం. దీనిపై అక్షయ్ స్పందిస్తూ... స్థలం, ఇల్లు అంటే అమ్మలకు తెలిసినంత ఇంకెవరికి తెలుసు. ఓ యజమాని ఇల్లు కొనేందుకు లేదా అమ్మేందుకు వస్తున్నాడంటే అతడికి ఖచ్చితమైన సమాచారం ఇవ్వగలగాలి. అది వీరికే సాధ్యమని విశ్వసించి అంతా వారినే తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు.