శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

జీన్స్ వేసుకొచ్చాడని తొడలు కోసిన టీచర్

సాధారణంగా విద్యార్థులు సరిగ్గా చదవకపోతేనో.. హోంవర్క్ చేయకపోతేనో కొడుతుంటారు. కానీ, యూనిఫాంకు బదులుగా జీన్స్ ప్యాంటు వేసుకొచ్చాడని ఓ స్టూడెంట్ దొడలు కోసాడో టీచర్.

సాధారణంగా విద్యార్థులు సరిగ్గా చదవకపోతేనో.. హోంవర్క్ చేయకపోతేనో కొడుతుంటారు. కానీ, యూనిఫాంకు బదులుగా జీన్స్ ప్యాంటు వేసుకొచ్చాడని ఓ స్టూడెంట్ దొడలు కోసాడో టీచర్. ఈ ఘటన శనివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లోని సికిందర్ నగర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి స్థానిక పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరి స్కూల్‌ యునిఫాం కాకుండా జీన్స్‌ ధరించి శనివారం పాఠశాలకు వెళ్లాడు. దీంతో ఆగ్రహానికి గురైన స్కూల్‌ మేనేజర్‌ ప్యాంట్‌ను కత్తిరించాలని టీచర్లకు సూచించాడు. 
 
దీంతో ఓ టీచర్‌ ఆ విద్యార్థి ప్యాంట్‌ను తొడలపై భాగం వరకు కత్తిరించే సమయంలో విద్యార్థి తొడలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థి తండ్రి స్కూల్‌ యాజమాన్య తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జపుతున్నారు.