శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 28 జూన్ 2017 (05:54 IST)

కొంపముంచిన చైనా బామ్మ... దెబ్బకు విమానం ఆగిపోయింది.

నమ్మకాలు, విశ్వాసాలు అనేవి మనుషులకు మాత్రమే పరిమితం చేసుకునేంతవరకు ఎవరికీ ఏ ఇబ్బందీ లేదు. కానీ పదిమంది మేలు కోరేవి అయినా సరే మన నమ్మకాలను బలవంతంగా మనుషులు మీద కాదు విమానంపైన రుద్దితే ఎలా మరి. అది ఎంత పెద్ద నేరమో తెలియని బామ్మ ఇప్పుడు చైనాలో అరదండాలు

నమ్మకాలు, విశ్వాసాలు అనేవి మనుషులకు మాత్రమే పరిమితం చేసుకునేంతవరకు ఎవరికీ ఏ ఇబ్బందీ లేదు. కానీ పదిమంది మేలు కోరేవి అయినా సరే మన నమ్మకాలను బలవంతంగా మనుషులు మీద కాదు విమానంపైన రుద్దితే ఎలా మరి. అది ఎంత పెద్ద నేరమో తెలియని బామ్మ ఇప్పుడు చైనాలో అరదండాలు తగిలించుకోవలసి వస్తోంది. ఆమె చేసిన పనల్లా ఏమిటంటే. విమాన ప్రయాణంలో ప్రమాదాలు జరగకూడదని  విమానం ఇంజన్ లోనే నాణాలు పడేయడం. 
 
 
అతీత శక్తులపై విపరీతమైన నమ్మకాన్ని విమానంపై చూపిందా చైనా బామ్మ. ఆ దెబ్బకు విమాన ప్రయాణమే ఆగిపోయింది. ఇంతకు ఏం  చేసిందంటే..షాంఘై ఫుడోంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గంగ్జౌ పట్టణానికి వెళ్లేందుకు విమానం సిద్ధంగా ఉంది. 80 ఏళ్ల బామ్మ, ఆమె భర్త, కుమార్తె, అల్లుడు కలిసి విమానం ఎక్కేందుకు వచ్చారు. విమానం ఎక్కేందుకు వచ్చిన బామ్మకు అతీతశక్తులపై విపరీతమైన నమ్మకం. 
 
దీంతో ప్రయాణంలో తమకెటువంటి హానీ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో బామ్మ తాపీగా నడుచుకుంటూ వెళ్లి ఇంజిన్‌లోకి ఓ తొమ్మిది నాణేలను విసిరేసింది. బామ్మ చేసిన పని చూసిన ఓ ప్రయాణికుడు ఆ విషయాన్ని విమాన సిబ్బందికి చెప్పాడు. దీంతో విమానాన్ని ఆపేశారు.బామ్మ చేసిన పనికి విమానం ఇంజిన్ విప్పి మరమ్మతు చేయాల్సి వచ్చింది. అప్పటికే విమానంలో ఎక్కి కూర్చున్న 150 మందిని దింపేశారు. 
 
అనంతరం ఇంజిన్ విప్పి పూర్తిగా గాలించగా 8 నాణేలు దొరికాయి. మరికొంత సేపు గాలించగా ఇంజిన్‌లో ఇరుక్కుపోయిన మరో నాణెం కనిపించడంతో విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం విమానాన్ని పంపించిన అధికారులు బామ్మను మాత్రం అదుపులోకి తీసుకున్నారు.