ఆరోగ్యం ఎలా వుంది? అని అడిగేందుకు వెళ్తే కరోనా వైరస్ సోకింది...

Coronavirus: Will this virus spread if you touch China goods
కరోనా వైరెస్
ఐవీఆర్| Last Modified మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (18:02 IST)
కరోనా వైరెస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటివరకూ ప్రపంచంలో 25 దేశాల్లో ఈ వైరెస్ వ్యాపించి వుంది. వైరస్ సోకిన రోగులను ప్రత్యేక వార్డుల్లో వుంచి చికిత్స అందిస్తున్నారు. ఐతే తాజాగా యూఎఇలో వుంటున్న ఓ భారతీయుడికి కరోనా వైరెస్ సోకినట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీనితో ఆందోళన వ్యక్తమవుతోంది.

కాగా యూఎఇలో ఇప్పటివరకూ 8 కరోనా వైరెస్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒకటి భారతదేశానికి చెందిన వ్యక్తి కూడా వున్నది. ఇతడు కరోనా వైరెస్ సోకిన రోగిని పరామర్శించేందుకు వెళ్లడంతో అది అతడికి వ్యాపించినట్లు వైద్యులు చెపుతున్నారు. వైరస్ సోకిన వ్యక్తులను విడిగా ఐసోలేటెడ్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నప్పటికీ యూఎఇలో భయభ్రాంతులు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలావుంటే కరోనా వైరెస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ వైరెస్ వ్యాప్తి ఎంతమాత్రం ఆగడటంలేదు. వివిధ దేశాలకు వ్యాపిస్తూనే వుంది. ఇది ఇలాగే సాగితే ప్రపంచంలో మరిన్ని దేశాలకు ఈ వైరెస్ వ్యాపించే ప్రమాదం వుందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. కరోనా కోరలు చాచడంతో చైనా నుంచి రవాణా మార్గాలను పలు దేశాలు నిషేధించాయి.దీనిపై మరింత చదవండి :