గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2016 (11:55 IST)

పాక్ సైన్యం ఏనాడో ఓడిపోయింది.. ఓడిన దళాలను పట్టించుకోం : బంగ్లాదేశ్ ప్రధాని

పాకిస్థాన్ సైన్యంపై బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా మరోమారు మండిపడ్డారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ... "పాక్ సైన్యం ఏనాడో ఓడిపోయింది. మేము వారిని 1971 యుద్ధంలో ఒడించాం. ఓడిపోయిన దళాలను కలిగిన్న పాక్

పాకిస్థాన్ సైన్యంపై బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా మరోమారు మండిపడ్డారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ... "పాక్ సైన్యం ఏనాడో ఓడిపోయింది. మేము వారిని 1971 యుద్ధంలో ఒడించాం. ఓడిపోయిన దళాలను కలిగిన్న పాక్, ఏం చెప్పినా మేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు" అని హసీనా అన్నారు. 
 
ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక బంధాలు కొనసాగుతాయని తెలిపారు. భారత్, పాక్ మధ్య ఇటీవలి కాలంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. ఈ ఉద్రిక్తతలకు పాకిస్థానే ప్రధాన కారణమని ఆమె ఆరోపించారు. 
 
ఇకపోతే... నవంబరులో ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన సార్క్ సదస్సు రద్దు కావడానికి ప్రధాన కారణం పాకిస్థానేనని చెప్పారు. యుద్ధ నేరాలు చేసిన వారికి తమ దేశం మరణశిక్షలను అమలు చేస్తుంటే, వాటిని నిరసిస్తూ, ఇస్లామాబాద్‌లో ప్రదర్శనలు జరుగుతుండటంతోనే తాము సార్క్ సమావేశాలకు హాజరు కారాదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.