శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 23 మార్చి 2017 (11:45 IST)

ఆ దేశంలో ప్రతి రోజూ 11 మంది మైనర్లపై అత్యాచారాలు...

పాకిస్థాన్ కేవలం ఉగ్రదేశంగానే కాదు... అత్యాచారాల కేంద్రంగా కూడా ముద్రపడింది. ఆ దేశంలో ప్రతి రోజూ సగటున 11 మంది బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నట్టు ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంద

పాకిస్థాన్ కేవలం ఉగ్రదేశంగానే కాదు... అత్యాచారాల కేంద్రంగా కూడా ముద్రపడింది. ఆ దేశంలో ప్రతి రోజూ సగటున 11 మంది బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నట్టు ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా గత యేడాదితో పోల్చితే పాక్‌లో బాల, బాలికలపై అత్యాచారాల కేసుల సంఖ్య పదిశాతం పెరినట్టు తెలుస్తోంది. 
 
2015వ సంవత్సరంలో బాలలపై అత్యాచారాల కేసులు 3,768 నమోదుకాగా, 2016లో ఈ కేసుల సంఖ్య 4,139 కి చేరుకుందని బాలలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సాహిల్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ తన నివేదికలో వెల్లడించింది. గత ఏడాది 2,410 మంది అమ్మాయిలు, 1,729 మంది బాలురు లైంగికంగా వేధింపులకు గురయ్యారని తేలింది.