గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2017 (10:31 IST)

నవాజ్ షరీఫ్‌కు ఊరట.. కుల్సుమ్‌ భారీ విజయం..

పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌ను పనామా కేసులో దోషిగా ప్ర‌క‌టిస్తూ జూలై 28న ఇస్లామాబాద్ కోర్టు సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఆ తీర్పు వల్లే ప్రధాని పదవికి షరీఫ్ రాజీనామా చేయాల్

పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌ను పనామా కేసులో దోషిగా ప్ర‌క‌టిస్తూ జూలై 28న ఇస్లామాబాద్ కోర్టు సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఆ తీర్పు వల్లే ప్రధాని పదవికి షరీఫ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ప‌నామా ప‌త్రాల కేసులో తీర్పును మ‌ళ్లీ పరిశీలించాల‌ని ష‌రీఫ్‌తో పాటు ఆయ‌న పిల్ల‌లు రివ్యూ పిటిష‌న్‌ వేశారు. అయితే దాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌కు పెద్ద ఊర‌ట ల‌భించింది. షరీఫ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో నవాజ్ షరీఫ్ సతీమణి కుల్సుమ్ నవాజ్ ఘన విజయం సాధించారు. ఎన్ఏ-120 నియోజ‌క‌వ‌ర్గానికి ఆదివారం ఎన్నిక‌లు నిర్వ‌హించ‌గా అర్థరాత్రి దాటిన త‌ర్వాత ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. ఈ ఎన్నికల్లో సొంత పార్టీ పీఎంఎల్‌-ఎన్ త‌ర‌పున పోటీ చేసిన కుల్సుమ్ 14,888 ఓట్ల‌తో గెలుపొందారు. 
 
మాజీ క్రికెట‌ర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ), బిలావల్ భుట్టో జ‌ర్దారీ పార్టీ అభ్య‌ర్థులు కూడా బ‌రిలో నిలిచి కుల్సుమ్‌కు గ‌ట్టి పోటీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో మొత్తం 3.20 లక్షల ఓట్లు పోల్ అయ్యాయి.
 
కుల్సుమ్ 59,413 ఓట్లు సాధించి సమీప పీటీఐ అభ్యర్థి యాస్మిన్ రషీద్‌పై జయకేతనం ఎగురవేశారు. ఈ ఎన్నిక‌ల్లో పాకిస్థాన్ చ‌రిత్ర‌లో తొలిసారి బ‌యోమెట్రిక్ విధానాన్ని ఉప‌యోగించారు. ఈ ఎన్నికల్లో కుల్సుమ్ విజయం సాధించడంపై నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ మాట్లాడుతూ.. దీన్ని ప్రజా తీర్పుగా అభివర్ణించారు.