పాకిస్థాన్‌లో ఘోరం.. కలుషిత సిరంజీతో 400 మందికి ఎయిడ్స్ ఎక్కించాడు..
తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శివకాశి ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణికి హెచ్‌ఐవీ బాధితుని రక్తం ఎక్కించిన ఘటన సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. దాయాది దేశం అయిన పాకిస్థాన్‌లో ఓ వైద్యులు కలుషి సిరంజీని వాడాడు. ఈ సిరంజీ ద్వారా దాదాపు 400 మంది చిన్నారులకు ఎయిడ్స్ సోకేలా చేశాడు.
ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఇప్పటికే ఎయిడ్స్ కేసులో పాకిస్థాన్ ఆసియాలోనే రెండో స్థానంలో ఉంది. ఒక్క 2017లోనే పాకిస్థాన్‌లో కొత్తగా 20,000 కేసులు నమోదయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. లర్కానా జిల్లాలోని రటోడెరో ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ ముజఫర్ గంగర్ వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. అయితే సిరంజీలు అందుబాటులో లేకపోవడంతో వైద్యులు ఒకే సూదిని వేడినీటిలో మరగబెట్టి వాడటం ప్రారంభించారు. ఈ క్రమంలో దాదాపు 400 మంది చిన్నారులకు ఎయిడ్స్ సోకింది. వీరిలో అత్యధికులు చిన్నారులు కావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ఈ ఆస్పత్రిలో చికిత్స పొందిన ప్రజలందరికీ హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాకుండా.. ఈ ఘోరానికి కారకుడైన వైద్యుడు ముజఫర్‌కు కూడా ఎయిడ్స్ ఉన్నట్లు అధికారులు తేల్చారు.
ఈ వ్యవహారంపై ముజఫర్ స్పందించాడు. తనకు హెచ్ఐవీ వున్న విషయం తనకు తెలియదని.. కావాలనే తాను కలుషిత సిరంజీని వాడలేదని.. స్పష్టం చేశాడు. కాగా.. ఈ డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి.. రిమాండుకు తరలించారు.