మా దేశంలో లక్షలాది మంది ఉగ్రవాదులు ఉన్నారు.. అయితే, ఏంటి?: పాక్ మంత్రి
ఉగ్రవాదులకు పుట్టినల్లుగా మారిందంటూ అంతర్జాతీయ సమాజం చేస్తున్న వ్యాఖ్యలకు పాకిస్థాన్ వైఖరిలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. నిజమే.. తమ దేశంలో లక్షలాది మంది ఉగ్రవాదులు ఉన్నారనీ ఆ దేశ విదేశాంగ మంత్రి ఖవ
ఉగ్రవాదులకు పుట్టినల్లుగా మారిందంటూ అంతర్జాతీయ సమాజం చేస్తున్న వ్యాఖ్యలకు పాకిస్థాన్ వైఖరిలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. నిజమే.. తమ దేశంలో లక్షలాది మంది ఉగ్రవాదులు ఉన్నారనీ ఆ దేశ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు.
చైనా వేదికగా జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సులో పాకిస్థాన్‌లో హెచ్చుమీరుతున్న ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తంచేసింది. ముఖ్యంగా తన మిత్రుడు చైనా కూడా సభ్య దేశంగా ఉన్న బ్రిక్స్ కూడా పాక్‌ను ఉగ్రదేశంగా అభివర్ణించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తొలిసారి తమ దగ్గర నిషేధిత ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉన్నట్లు ఆ దేశం అంగీకరించింది.
దీనిపై ఆ దేశ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ, అవును అందులో ఆశ్చర్యం ఏముంది? మన దగ్గర ఈ నిషేధిత ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి అని ఆయన సింపుల్‌గా బదులిచ్చారు. గత మూడేళ్ల నుంచి ఆ సంస్థ ఆట కట్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా ఆసిఫ్ వెల్లడించారు. అంతేకాదు బ్రిక్స్ ఆందోళనలు చైనావి కావని కూడా ఆయన సన్నాయి నొక్కులు నొక్కారు.