ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 నవంబరు 2016 (18:34 IST)

యుద్ధమంటూ జరిగితే భారత్‌పై పాకిస్థాన్ అణ్వాయుధాల ప్రయోగం.. అమెరికా వార్నింగ్

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమంటూ జరిగితే అణ్వాయుధాలు ప్రయోగించే అవకాశం ఉందని అమెరికా శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ దిశగా పాకిస్థాన్ భారీ మొత్తంలో అణ్వాయుధాలను సిద్ధం చేస్తోందని వారు ప్రకటించారు

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమంటూ జరిగితే అణ్వాయుధాలు ప్రయోగించే అవకాశం ఉందని అమెరికా శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ దిశగా పాకిస్థాన్ భారీ మొత్తంలో అణ్వాయుధాలను సిద్ధం చేస్తోందని వారు ప్రకటించారు. అణ్వాయుధాల తయారీపై గతంలో అమెరికా విధించిన ఆంక్షలను సైతం పాకిస్థాన్ తోసిరాజని వీటిని సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించారు. 
 
గూగుల్ మ్యాప్స్ ద్వారా 10 పాకిస్థానీ అణ్వాయుధ స్థావరాలను పరిశీలించిన అమెరికా శాస్త్రవేత్తలు ఈ మేరకు పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఎఫ్ఏఎస్‌కు చెందిన హన్స్ ఎమ్ క్రిస్టెన్సన్ మాట్లాడుతూ, ఎయిర్ బేస్‌లలో అణ్వాయుధాల తయారీతో పాటు ఫైటర్ జెట్లకు వాటిని మోసుకెళ్లే సామర్ధ్యాన్ని పెంపొందిస్తున్నారని అన్నారు.
 
ముఖ్యంగా 10 బేస్‌లలో ఐదు గ్యారిసన్లు (సైనిక స్థావరాలు), రెండు ఎయిర్ బేస్‌లను పాకిస్థాన్ సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఈ స్థావరాలకు 130 నుంచి 140 వార్ హెడ్‌లను తరలించినట్టు ఆయన వెల్లడించారు. అలాగే అమెరికాతో జరిగిన ఒప్పందాల మేరకు జారీచేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఎఫ్-16 ఫైటర్ల ద్వారా న్యూక్లియర్ వార్ హెడ్‌లను, మిరాజ్ ఫైటర్ల ద్వారా రాడ్ ఎయిర్ లాంచ్ క్రూస్ మిస్సైల్‌ను మోసుకెళ్లగల సామర్ధ్యాలను కూడా జోడించిందని ఆయన వెల్లడించారు. 
 
ఇందుకు చైనా సహకారాన్ని పాకిస్థాన్ తీసుకుంటుందని తెలిపారు. అక్రో (సింధ్ ప్రావిన్స్), గుజ్రన్ వాలా (పంజాబ్ ప్రావిన్స్), ఖుజ్దర్ (బలూచిస్తాన్), పనో అక్విల్ (సింధ్ ప్రావిన్స్), సర్గోధాల్లో పాకిస్థాన్ ఈ అణ్వాయుధాలను తయారుచేస్తోందని ఆయన తెలిపారు. అలాగే, పశ్చిమ ఇస్లామాబాద్‌లో గల పాకిస్థానీ నేషనల్ డెవలప్‌మెంట్ కాంప్లెక్స్‌లో షాహీన్-2, బాబర్ మిస్సైల్స్‌ను కూడా సిద్ధం చేస్తున్నట్టు వారు తెలిపారు. ఈ మొత్తానికి సాంకేతిక సామర్థ్యం చైనా అందిస్తోందని వారు అభిప్రాయపడ్డారు.