శుక్రవారం, 18 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2016 (22:04 IST)

అపశకునం... పాక్ రక్షణ మంత్రి ప్యాంట్ ఊడిపోయింది(Video)

భారత్-పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. యూరీ ఘటనలో భారత సైనికులు మరణిస్తే సంతాపం ప్రకటించకుండా మిన్నకుండిపోయిన పాకిస్థాన్ ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై

భారత్-పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. యూరీ ఘటనలో భారత సైనికులు మరణిస్తే సంతాపం ప్రకటించకుండా మిన్నకుండిపోయిన పాకిస్థాన్ ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసి ఉగ్రమూకలు హతమారిస్తే మాత్రం ఒంటి కాలుపై లేస్తోంది. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తుంది.

కాల్పుల ఉల్లంఘనకు పాల్పడి అబ్బే మేము ఆ పని చేయలేదే.. భారత సైన్యం జరిపిన కాల్పులకే ఎదురు కాల్పులు చేశామంటూ చేతులు దులుపుకుంటోంది. కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటమే కాకుండా ఇందుకు ప్రతీకార చర్య కోసం పాకులాడుతోంది. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్ర శిబిరాలపై భారత బలగాలు మెరుపుదాడులు చేయడంపై కోపంతో ఊగిపోయిన పాక్ రక్షణ మంత్రి ప్యాంట్ ఊడింది. కెమెరా సాక్షిగా పాక్ రక్షణ మంత్రి క్వాజా మహ్మద్ ప్యాంట్ ఊడిపోయింది. రక్షణ మంత్రి ప్యాంటు ఊడిపోవడం అపశకునంగా ఇప్పుడు పాక్ జనం చెప్పుకుంటున్నారట. తన సొంత ప్యాంట్ కాపాడుకోలేని మంత్రి అణ్వస్త్రాలు వేస్తామంటూ భారత్‌ను బెదిరించడాన్ని అందరూ ఎద్దేవా చేస్తున్నారు. 
 
పాకిస్థాన్ మీడియాలోనే రక్షణ మంత్రి ప్యాంట్ ఊడిపోవడం హాట్ టాపిక్ అయ్యింది. పాక్ మీడియాతో పాటు భారత్‌లో కూడా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. లక్షలాది మంది ఈ వీడియోను చూశారు. సోషల్ మీడియాలోనూ ఈ వీడియోకు వ్యూవ్స్ పెరిగిపోతోంది. మీరూ చూడండి.