గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (21:37 IST)

పదునైన కత్తితో తలలు ఎలా తెగనరకాలో తెలుసా: పాక్‌లో శిక్షణ

దాయాది దేశం పాకిస్థాన్‌లో అరాచకం వెర్రితలలు వేస్తోంది. మతంపై దురభిమానం పెచ్చుమీరిపోతోంది. ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న ఈ దేశం తాజాగా వివాదాస్పద చిత్రాలను ఓ పత్రిక ప్రచురిస్తే, అందుకు ప్రతీకారం అంటూ అమాయకుల తలలు తెగ్గోయడానికి బాలికలకు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలు మతపరమైన బోధనలు చేసే పాఠశాలల్లో జరుగుతుండటం గమనార్హం. ఉత్తర అమెరికాకు చెందిన మాజీ ముస్లింలు ఓ వీడియోను ట్వీట్ చేయడంతో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 
 
ఇటీవల ఫ్రాన్స్ దేశంలో మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ ఈ దేశానికి చెందిన 'ఛార్లీ హెబ్డో' మ్యాగజైన్ వివాదాస్పద కార్టూన్‌ను ఇటీవల పునర్ముద్రించిన సంగతి తెలిసిందే. వీటిని చూసి పాక్ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెంచ్ పత్రిక వైఖరిపై పాక్‌లో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, అక్కడి మత ఛాందసవాద సంస్థలు ఓ అడుగు ముందుకేసి తలలు తెగ్గోయడంలో బాలికలు, యువతులకు శిక్షణ ఇస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
వాస్తవానికి పాక్‌లోని అనేక మదరసాల్లో (మసీదులు) ఈ తరహా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు సర్వసాధారణం. అయితే, ఇపుడు అభంశుభం తెలియని చిన్నారి బాలికలకు శిక్షణ ఇవ్వడం, ముఖ్యంగా పదునైన కత్తితో మనిషి మెడను కోయడం ఎలా అన్న దానిపై ట్రైనర్స్ శిక్షణ ఇవ్వడం ఇపుడు ప్రపంచాన్ని నివెవ్వరపాటుకు గురిచేసింది. 
 
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ దిష్టిబొమ్మ తయారుచేయించి దానిపై పీక కోయడం ప్రాక్టీసు చేయించారు. అంతేకాదు, మహ్మద్ ప్రవక్తను అవమానించిన వారి తలలు తెగ్గోయాలంటూ వారితో నినాదాలు కూడా చేయిస్తున్నారు. బురఖాలు ధరించిన యువతులు, బాలికలు ఈ శిక్షణలో పాల్గొన్నారు. 
 
ఓ దిష్టి బొమ్మ తలను తెగనరకడం గురించి ఓ యువతి వివరించింది. ఆమెను మిగిలినవారంతా అనుకరించారు. ఇస్లాం వ్యతిరేకులను హెచ్చరిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మహమ్మద్ ప్రవక్తపై విమర్శలు చేసేవారిపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం తాము రక్తం చిందించడానికి సైతం వెనుకాడబోమని ఓ యువతి చెప్పింది.