ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2016 (09:02 IST)

ప్రాణ నష్టమే లక్ష్యంగా భారత్‌లో విధ్వంసం.. సీపర్‌ సెల్స్‌కు ఉగ్రవాదుల ఆదేశం

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులతో తీవ్రవాద సంస్థలు ఆగ్రహం, ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. ఈ దాడులకు ప్రతీకారం ఏదోవిధంగానైనా తీర్చుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉన్నా

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులతో తీవ్రవాద సంస్థలు ఆగ్రహం, ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. ఈ దాడులకు ప్రతీకారం ఏదోవిధంగానైనా తీర్చుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉన్నాయి. ఇందులో భాగంగానే, 'చిన్నచిన్న దాడులు కాదు.. భారత భద్రతాదళాలపై భారీ దాడులు చేయండి' అంటూ స్లీపర్‌ సెల్స్‌కు, స్థానిక ఉగ్రవాదులకు స్పష్టంచేశారు. 
 
అయితే, ఈ దాడి చేసే ప్రాణ నష్టం భారీగా ఉండాలని, భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు ఉలిక్కిపడేలా ఉండాలని ఆదేశించారు. ఉగ్రవాదుల ఫోన్‌ కాల్స్‌ను ట్రాప్‌చేసి ఇంటెలిజెన్స్‌ అధికారులు వారి సంభాషణలను రికార్డు చేశారు. భద్రతా దళాలపై భారీ దాడులు జరిగే అవకాశం ఉందని హ్చెరించారు. 
 
'పాక్‌ సరిహద్దుల్లో ఇప్పటికీ దాదాపు 200 మంది ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారు. దానినిబట్టి, సర్జికల్‌ దాడులు చేసి ఉగ్రవాదులను మనం ఏమాత్రం నిలువరించలేకపోతున్నాం' అని ఆర్మీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.