కాల్పుల్లో గర్భవతి ప్రాణాలు కోల్పోయింది.. కడుపులోని బిడ్డ మాత్రం ప్రాణాలతో ఉంది.. పేరు మిరాకిల్
చికాగోలో కనివినీ వింతచోటుచేసుకుంది. 19 సంవత్సరాల యువతి గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో మరణించగా, ఆమె గర్భంలోని బిడ్డ ప్రాణాలతో ఉందని తెలుసుకున్న వైద్యులు బిడ్డను సురక్షితంగా బయటకు తీశారు.
చికాగోలో కనివినీ వింతచోటుచేసుకుంది. 19 సంవత్సరాల యువతి గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో మరణించగా, ఆమె గర్భంలోని బిడ్డ ప్రాణాలతో ఉందని తెలుసుకున్న వైద్యులు బిడ్డను సురక్షితంగా బయటకు తీశారు. ఈ పాపకు 'మిరాకిల్' అని పేరు. ఆ వివరాలను పరిశీలిస్తే... పరాశ బియర్డ్(19) అనే మహిళ ఓ 26 ఏళ్ల వ్యక్తితో కలిసి దక్షిణ చికాగోలోని ఓ కారులో కూర్చొని ఉంది.
అంతలో గుర్తు తెలియని దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఆమె మెడలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోగా.. దీంతో వారిద్దరు ప్రాణాలు కోల్పోయారు. అక్కడికి వచ్చిన పోలీసు సిబ్బంది గర్భవతి అయిన పరాశను ఆస్పత్రికి తరలించగా ఈ మిరాకిల్ లోకాన్ని చూసింది. బియర్డ్ ఇంటికి వెలుపల సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపినవారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.