ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 10 సెప్టెంబరు 2018 (09:46 IST)

విమానంలో ఓవర్ లోడ్... కుప్పకూలి 19 మంది మృతి

ఓ విమాన సిబ్బంది పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నందుకు భారీ మూల్యమే చెల్లించుకుంది. విమానం కుప్పకూలిపోవడంతో ఏకంగా 19 మంది మృత్యువాతపడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన దక్షిణ

ఓ విమాన సిబ్బంది పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నందుకు భారీ మూల్యమే చెల్లించుకుంది. విమానం కుప్పకూలిపోవడంతో ఏకంగా 19 మంది మృత్యువాతపడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన దక్షిణ సూడాన్‌లో జరిగింది.
 
నిజానికి ఈ విమానంలో కేవలం 19 మంది మాత్రమే ప్రయాణం చేయడానికి అనుమతి ఉంది. కానీ, విమాన సిబ్బంది మాత్రం 23 మందిని ఎక్కించుకున్నారు. ఈ ఫ్లైట్ జుబా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యిరోల్‌ నగరానికి బయలుదేరిన కమర్షియల్ విమానం కాసేపటికే ఓ సరస్సులో కుప్పకూలింది. 
 
ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలతో బయటపడిన నలుగురిలో ఆరేళ్ల బాలిక, మరో చిన్నారి, ఇటాలియన్ వైద్యుడు, ఓ యువకుడు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరిలో వైద్యుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.