గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 5 జులై 2017 (14:12 IST)

#Modiiniisrael : మోషేను ఆప్యాయంగా పలకరించిన ప్రధాని మోడీ.. ఎవరీ మోషే?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయేల్ పర్యటనలో పూర్తి బిజీగా గడుపుతున్నారు. అదేసమయంలో అనాథగా జీవిస్తున్న మోషేను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా పలుకరించారు. ఇంతకీ ఈ మోషే ఎవరన్నదే కదా మీ సందేహం.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయేల్ పర్యటనలో పూర్తి బిజీగా గడుపుతున్నారు. అదేసమయంలో అనాథగా జీవిస్తున్న మోషేను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా పలుకరించారు. ఇంతకీ ఈ మోషే ఎవరన్నదే కదా మీ సందేహం. 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడుల్లో మోషే తల్లిదండ్రులను కోల్పోయింది. అప్పటి నుంచి అనాథగా జీవిస్తోంది. ప్రధాని మోడీ తన ఇజ్రాయేల్ పర్యటనలో ఈమెను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా పలుకరించారు. 
 
కాగా, ముంబై ఉగ్రదాడుల తరువాత ఒంటరిగా మిగిలిన మోషేతో పాటు శాండ్రా సైతం ఇజ్రాయిల్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. శాండ్రాకు ఇజ్రాయెల్ ప్రభుత్వం గౌరవ పౌరసత్వాన్ని ఇచ్చింది. ప్రస్తుతం మోషే వయసు పదేళ్లు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు వస్తుంటే, తమ కుటుంబాన్ని ఆహ్వానించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని మోషే తాతయ్య, నానమ్మలు వ్యాఖ్యానించారు.
 
ఇజ్రాయెల్‌లో కాలు పెట్టిన తొలి భారత ప్రధానిగా మంగళవారం నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించగా, ఆయనకు ఘన స్వాగతం పలికిన ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, అప్పటి నుంచీ మోడీ వెంటే ఉన్నారు. ఇక మోడీ పర్యటన గురువారంతో ముగియనుంది.