శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (20:17 IST)

కోర్టు ఆవరణలో మోసగత్తె బిడ్డకు పాలిచ్చిన మహిళా పోలీస్... ఫోటో వైరల్...

బిడ్డ పాల కోసం ఏడుస్తుంటే ఏ కన్నతల్లి హృదయమైనా కరిగిపోతుంది. అదే ఇక్కడా జరిగింది. చైనాలో ఓ మోసగత్తె కోర్టు విచారణకు హాజరయ్యేందుకు తన నాలుగు నెలల బిడ్డను తీసుకుని వచ్చింది. కోర్టు విచారణకు గాను లోపలికి వెళ్లేందుకు తన బిడ్డను అక్కడే వున్న మహిళా పోలీసు

బిడ్డ పాల కోసం ఏడుస్తుంటే ఏ కన్నతల్లి హృదయమైనా కరిగిపోతుంది. అదే ఇక్కడా జరిగింది. చైనాలో ఓ మోసగత్తె కోర్టు విచారణకు హాజరయ్యేందుకు తన నాలుగు నెలల బిడ్డను తీసుకుని వచ్చింది. కోర్టు విచారణకు గాను లోపలికి వెళ్లేందుకు తన బిడ్డను అక్కడే వున్న మహిళా పోలీసు చేతిలో పెట్టి వెళ్లింది. కొద్దిసేపటికే ఆ బిడ్డ పాల కోసం కెవ్వుమంటూ ఏడ్వడం మొదలుపెట్టింది. 
 
కన్నతల్లి కోర్టు బోనులో విచారణను ఎదుర్కొంటోంది. చేతుల్లో పసిబిడ్డ ఆకలితో ఏడుస్తోంది. అంతే... ఆ మహిళా పోలీసు బిడ్డకు అక్కడే పాలిచ్చింది. ఈ ఫోటో ఇప్పుడు నెట్లో వైరల్ అయ్యింది. ఆమెపై పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. ఐతే కోర్టు విచారణ ముగిసిన తర్వాత బిడ్డ కన్నతల్లి తన బిడ్డకు మహిళా పోలీసు పాలివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించింది.