బాలింతలు మష్రూమ్స్ వంటకాలు తీసుకోకూడదట..?
ప్రపంచ వ్యాప్తంగా 35రకాలకు మించిన మష్రూమ్స్ వున్నాయి. అవన్నీ తినేందుకు తగినవి కాదు. పలు రకాల పుట్టగొడుగులు విషంతో కూడినవి వున్నాయి. మనం వంటల్లో ఉపయోగించే మష్రూమ్స్‌ను వైట్ బటన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుం
ప్రపంచ వ్యాప్తంగా 35రకాలకు మించిన మష్రూమ్స్ వున్నాయి. అవన్నీ తినేందుకు తగినవి కాదు. పలు రకాల పుట్టగొడుగులు విషంతో కూడినవి వున్నాయి. మనం వంటల్లో ఉపయోగించే మష్రూమ్స్‌ను వైట్ బటన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. వైట్ బటన్ మష్రూమ్స్‌ను డైట్‌లో చేర్చుకునే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇందుకు కారణం వీటిలో వుండే బోలెడు పోషకాలే. ఇంతకీ మష్రూమ్స్‌లో ఎలాంటి పోషకాలున్నాయో చూద్దాం..
మష్రూమ్స్‌లో సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా ఉండటం ద్వారా రక్తపోటును దూరం చేసుకోవచ్చు. ఇందులోని బీటా గ్లూకాన్ రక్తంలో కొవ్వును తొలగించడంలో మెరుగ్గా పనిచేస్తుంది. తద్వారా గుండెకు ఎంతో మేలు చేస్తుంది. మష్రూమ్స్‌లో వుండే లెంటిసైన్, ఎరిటడెనిన్ వంటి ధాతువులు రక్తంలో కలిసిపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తద్వారా రక్తం శుద్ధీకరించబడుతుంది. ఫైబర్ తరహాలో మష్రూమ్స్‌లో పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది. ఎలాగంటే.. వంద గ్రాముల మష్రూమ్స్‌లో 447 మి.గ్రాముల పొటాషియం, 9.మి.గ్రాముల సోడియం వుంటాయి.
మష్రూమ్స్‌ను పక్షవాతం ఉన్నవారు తీసుకోకూడదు. వీటిని బాగా ఉడికిన తర్వాతే వడ్డించాలి. పచ్చిగా తినడం మంచిది కాదు. ఇంకా మష్రూమ్స్‌కు తల్లిపాలను తగ్గించే శక్తి వుండటంతో బాలింతలు వీటిని తినకుండా వుండటమే మేలు. ఇక క్యాన్సర్లను ఇది దూరం చేస్తుంది. ఇందులోని ఫైబర్.. శరీరానికి కావాల్సిన అమినో ఆమ్లాలను అందిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
ఐరన్, జింక్, కాపర్, విటమిన్ కె, సి, డి, బీ వంటి పోషకాలు ఇందులో ఉన్నాయి. ఇవి ఆస్తమా వంటి శ్వాస సమస్యలను దూరం చేస్తాయి. పీచు అధికంగా కలిగివుండటం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు. శాకాహారులకు ఇదెంతో మేలు చేస్తుంది.
పచ్చి బఠాణీలు, పాలు, కోడిగుడ్లు, చేపలు, చికెన్ కంటే మష్రూమ్స్‌లో అధిక ప్రోటీన్లు వున్నాయి. మష్రూమ్స్, క్యాబేజీ, పచ్చి బఠాణీలు కలిపి సూప్ తయారు చేసి తీసుకుంటే.. ఉదరసంబంధిత రుగ్మతలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.