ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 15 జూన్ 2017 (12:07 IST)

బెనజీర్ భుట్టో కుమారుడి ఇఫ్తార్ విందు.. చికెన్ బిర్యానీ కోసం కొట్టుకున్న అతిథులు..

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, దివంగత బెనజీర్ భుట్టో కుమారుడు, పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇచ్చాడు. ఈ విందు రచ్చరచ్చ అయింది. విందుకు హాజరైన అతిథులంతా ఆకల

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, దివంగత బెనజీర్ భుట్టో కుమారుడు, పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇచ్చాడు. ఈ విందు రచ్చరచ్చ అయింది. విందుకు హాజరైన అతిథులంతా ఆకలికి తట్టుకోలేక... బిర్యానీ కోసం చొక్కాలు చినిగిపోయేలా కొట్టుకున్నారు. 
 
చికెన్ ముక్కలు, మటన్ ముక్కల కోసం ఎగబడ్డారు. ఒకొరినొకరు తోసుకుంటూ బిర్యానీ కోసం పోటీలు పడ్డారు. ఈ సందర్భంగా ఘర్షణ చోటు చేసుకుంది. కొందరైతే టేబుల్‌పై పెట్టిన ఆహార పదార్థాలను పడేసి, అందులో ఎంగిలి ప్లేట్లు ముంచారు. దీంతో, అక్కడి పరిస్థితి చాలా అసహ్యంగా మారింది. 
 
ఒక దేశంలో అతిపెద్ద పార్టీగా ఉన్న పీపుల్స్ పార్టీ తరపున ఇచ్చిన ఇఫ్తార్ విందు చివరకు రసాభాసగా ముగియడం ఇపుడు పెద్ద వివాదాస్పదమైంది. పాకిస్థాన్ ప్రజల కంటే.. నేతలే తిండికోసం కొట్టుకోవడంతో ప్రపంచ ప్రజల దృష్టిలో పరువు పోయిందని విపక్ష నేతలు వాపోతున్నాురు.