అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేయాలి, ట్రంప్ ప్రకటన

trump
వి| Last Modified శుక్రవారం, 31 జులై 2020 (15:51 IST)
అమెరికాలో కరోనా మహమ్మారి విలయ తాండవమాడుతున్న సందర్భంగా ట్రంప్ అనూహ్య ప్రకటన చేసారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరి కొన్ని నెలల సమయమే ఉన్నందున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎన్నికలు నవంబర్ 3న నిర్వహించకుండా కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని చెప్పారు.

అమెరికాలో కరోనా విజృంభణ విపరీతంగా ఉండటంతో ప్రజలు ధైర్యంగా ఓటు వేసే వరకు ఎన్నికలు వాయిదా వేయడం మంచిదని తెలిపారు. అమెరికాలో ఈ విషయాలను పట్టించుకోకుండా మెయిల్ ఇన్ ఓటింగ్ విధానాన్ని చేపడితే ఎన్నికలు మోసపూరిత ఎన్నికలుగా చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు.

కోవిడ్ 19 సంక్షోభం నుండి కోలుకొని ప్రజలు సరిగ్గా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పరిస్థితులు వచ్చేంత వరకు ఎన్నికలు వాయిదా వేయాలన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 1845 నుంచి నవంబర్ 3నే జరుగుతున్నాయి. ఆ తేదీలను మార్చే అధికారం అమెరికా అధ్యక్షుడికి లేదని తెలుస్తోంది.
దీనిపై మరింత చదవండి :