శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 20 జులై 2017 (13:18 IST)

స్పెయిన్ బీచ్‌లో అత్యాచారానికి గురై.. అపస్మారక స్థితిలో పడివున్న బ్రిటన్ యువతి

స్పెయిన్ దేశంలో డొరియన్ బీచ్‌‍లో మ్యూజిక్ ప్రోగ్రామ్ జరుగుతుండగా 21ఏళ్ల బ్రిటన్‌ యువతి అత్యాచారానికి గురైంది. బ్రిటన్ మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాల్లోకి వె

స్పెయిన్ దేశంలో డొరియన్ బీచ్‌‍లో మ్యూజిక్ ప్రోగ్రామ్ జరుగుతుండగా 21ఏళ్ల బ్రిటన్‌ యువతి అత్యాచారానికి గురైంది. బ్రిటన్ మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గత శనివారం అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో 21 ఏళ్ల యువతి అత్యాచారానికి గురైంది. బీచ్ రోడ్డులో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు.
 
బాధితురాలు మందు తాగి వుండటంతో ఆమె బట్టలను ఫోరెన్సిక్ టెస్టుకు పంపిన పోలీసులు ఆధారాలను సేకరించారు. పోలీసుల నివేదికలో బ్రిటన్ మహిళ అత్యాచారానికి గురైందని.. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి స్పెయిన్ దేశానికి చెందిన వాడై వుంటాడని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.