హిందువులను ఊచకోత కోసిన రోహింగ్యా ముస్లింలు.. ఎక్కడ?
మయన్మార్‌లో దారుణం జరిగింది. ఈ దేశంలోని రఖినెలో హిందువులను రోహింగ్యా ముస్లింలు ఊచకోత కోశారు. హిందువులు నివసించే గ్రామాలపైపడి 53 మందిని ఊచకోతకు పాల్పడినట్టు ఆమ్నెస్టీ ఇంటర్నషనల్ వెల్లడించింది.
మయన్మార్‌లో దారుణం జరిగింది. ఈ దేశంలోని రఖినెలో హిందువులను రోహింగ్యా ముస్లింలు ఊచకోత కోశారు. హిందువులు నివసించే గ్రామాలపైపడి 53 మందిని ఊచకోతకు పాల్పడినట్టు ఆమ్నెస్టీ ఇంటర్నషనల్ వెల్లడించింది. ఈ దారుణం గత యేడాది ఆగస్టు 25వ తేదీన జరిగినట్టు అమ్నెస్టీ తన తాజా నివేదికలో వెల్లడించింది. అదే రోజు రోహింగ్యా తిరుగుబాటుదారులు పోలీసు పోస్టులపై దాడులకు తెగబడ్డారని, దీంతో రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్లిందని గుర్తుచేసింది.
రోహింగ్యాల దాడులతో మయన్మార్ మిలటరీ రంగంలోకి దిగింది. దీంతో దాదాపు 7 లక్షల మంది రోహింగ్యాలు దేశం విడిచిపెట్టి సరిహద్దు దేశాలకు పారిపోయారు. అదేసమయంలో తమపై జరుగుతున్న దాడులకు ఆగ్రహంతో ఊగిపోయిన రోహింగ్యాలు హిందువులు నివసిస్తున్న ఉత్తర రఖినెలోని గ్రామాలపై దాడులు చేసి వారిని ఊచకోత కోశారని అమ్నెస్టీ వెల్లడించింది.
హిందువులు ఊచకోతకు గురైన ప్రాంతానికి గతేడాది సెప్టెంబరులో రిపోర్టర్లను తీసుకెళ్లిన మిలటరీ రోహింగ్యాల దుశ్చర్యను ప్రపంచానికి చూపించింది. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. అయితే, అది తమ పని కాదని అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ (ఏఆర్ఆర్ఎస్ఏ) అప్పట్లోనే ప్రకటించింది.