శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (15:27 IST)

హైస్కూల్‌పై కాల్పులు జరిపి.. వాల్ మార్ట్, మెక్ డొనాల్డ్స్‌కు వెళ్లాడు...

అమెరికా, ఫ్లోరిడాలోని హైస్కూల్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 17మంది ప్రాణాలు బలిగొన్న నిందితుడు నికోలస్ క్రూజ్ గురించి షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రొఫెషనల్ షూటర్‌ను అవుతానని గతంలోనే యూట్య

అమెరికా, ఫ్లోరిడాలోని హైస్కూల్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 17మంది ప్రాణాలు బలిగొన్న నిందితుడు నికోలస్ క్రూజ్ గురించి షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రొఫెషనల్ షూటర్‌ను అవుతానని గతంలోనే యూట్యూబ్‌లో క్రూజ్ ఓ కామెంట్ పెట్టాడని పోలీసులు తెలిపారు. ఈ యూట్యూబ్ కామెంట్‌ చూసిన పాఠశాల యాజమాన్యం అతనిని బహిష్కరించింది. ఈ కోపంతోనే అతడు స్కూలుపై కాల్పులు జరిపాడని తెలుస్తోంది. 
 
 ఇలా షూటింగ్‌లో రాణించిన క్రూజ్ హైస్కూల్‌పై కాల్పులు జరిపిన అనంతరం సమీపంలోని రెండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వెళ్లాడు. ఈ మారణకాండ జరిగిన రెండు గంటల్లోనే అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడు ఓ వాల్ మార్ట్ సబ్ వే రెస్టారెంట్ వద్ద.. ఆపై మెకొ డొనాల్డ్స్ రెస్టారెంట్లను సందర్శించాడని పోలీసులు తెలిపారు.
 
కాల్పుల భయంతో పరుగులు తీస్తున్న విద్యార్థులతో అతను కూడా కలిసిపోయాడని వెల్లడించారు. ఇంకా అతడు కాల్పులు జరిపిన పార్క్ ల్యాండ్‌లోని మార్జొరీ స్టోన్‌మ్యాన్ డౌగ్లౌస్ హైస్కూలుకు చెందిన పూర్వ విద్యార్థేనని పోలీసులు వెల్లడించారు.