సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2018 (08:45 IST)

అమెరికాలో గన్‌కల్చర్... సస్పెండ్ చేశారనీ సహచరులను కాల్చి చంపిన విద్యార్థి

అమెరికాలో గన్‌కల్చర్ మరోమారు పడగవిప్పింది. ఉన్మాదిగా మారిన ఓ విద్యార్థి సహచర విద్యార్థిని తుపాకీతో కాల్చిచంపాడు. ఈ దుశ్చర్యలో మొత్తం 17 మంది మృత్యువాతపడగా, మరికొందరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో

అమెరికాలో గన్‌కల్చర్ మరోమారు పడగవిప్పింది. ఉన్మాదిగా మారిన ఓ విద్యార్థి సహచర విద్యార్థిని తుపాకీతో కాల్చిచంపాడు. ఈ దుశ్చర్యలో మొత్తం 17 మంది మృత్యువాతపడగా, మరికొందరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. 
 
ఫ్లోరిడా రాష్ట్రం పార్క్‌ల్యాండ్‌లోని మార్జోయ్‌ స్టోన్‌మన్‌ డగ్లస్‌ పాఠశాలలో చదువుతున్న నికోలస్‌ క్రజ్‌(19)పై కొద్దిరోజుల క్రితం పాఠశాల యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు తీసుకుని, అతడిని సస్పెండ్ చేసింది. దీంతో కోపంతో రగిలిపోయిన క్రజ్.. గన్ చేతపట్టుకుని పాఠశాలలోకి ప్రవేశించి కాల్పులకు తెగబడ్డాడు. అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ముగ్గురిని కాల్చేశాడు. 
 
అనంతరం పాఠశాలలోని ఫైర్ అలారం మోగించాడు. దీంతో ఏదో జరిగిపోతుందన్న కంగారులో అందరూ ప్రవేశ ద్వారం వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడే కాచుకుని ఉన్న క్రజ్.. వచ్చిన వారిని వచ్చినట్లు కాల్చి చంపేశాడు. అయితే అప్పటికే కాల్పుల సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో దుండగుడు పాఠశాల భవనంలో దాక్కున్నాడు. అనంతరం పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు కూడా దుండగుడిపై ఎదురు కాల్పులకు దిగారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు.