గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (16:47 IST)

టీచర్ చెంపదెబ్బ: 11 ఏళ్ల విద్యార్థిని మృతి.. ఎక్కడ?

ఉపాధ్యాయురాలి చెంపదెబ్బతో 11 ఏళ్ల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రజనీ ఉపాధ్యాయ్ అనే ట

ఉపాధ్యాయురాలి చెంపదెబ్బతో 11 ఏళ్ల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రజనీ ఉపాధ్యాయ్ అనే టీచర్.. ఓ చిన్నారి చెంపఛెల్లుమనిపించింది. అంతే ఆ విద్యార్థిని అక్కడే స్పృహ తప్పి కిందపడిపోయింది. 
 
అనంతరం ఆ బాలికను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చెంపపై బలంగా కొట్టడంతోనే ఆమె చనిపోయినట్లు పోలీసులు చెప్తున్నారు. బాలికపై చేజేసుకున్న టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బాలిక మృతదేహంతో పాఠశాల ముందు తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఫలితంగా ఆ టీచర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.