శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 8 జనవరి 2021 (13:05 IST)

లాటరీలో రూ. 40 కోట్లు గెలుచుకున్న భారతీయుడు

యూఏఈలోని ఓ భారతీయుడు లాటరీలో 2 కోట్ల దిర్హామ్‌(దాదాపు రూ. 40 కోట్లు)లను గెలుచుకున్నాడు. కేరళకు చెందిన అబ్దుస్సలామ్ అనే భారతీయుడు డిసెంబర్ 29న అబూధాబీలో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఈ టికెట్‌పై అబ్దుస్సలామ్ 2 కోట్ల దిర్హామ్‌లు గెలుపొందాడు.

తాను ఇప్పటివరకు నాలుగైదు సార్లు ఈ రాఫిల్‌లో పాల్గొన్నానని, లాటరీ తగులుతుందని ఎన్నడూ అనుకోలేదన్నాడు. ఇప్పుడు ఒకేసారి ఇంత మొత్తం గెలుపొందడం నిజంగా ఆనందంగా ఉందన్నాడు.

తాను గెలుచుకున్న ప్రైజ్‌లో కొంత మొత్తాన్ని తన స్నేహితులకు ఇవ్వనున్నట్టు అబ్దుస్సలామ్ చెప్పాడు. తన పిల్లల చదువుకు మరికొంత డబ్బును పక్కన పెట్టనున్నట్టు చెప్పుకొచ్చాడు. కాగా.. ఇదే రాఫిల్‌లో మరో భారతీయుడు 30 లక్షల దిర్హామ్‌(దాదాపు రూ. 6 కోట్లు)ల లాటరీని గెలుపొందాడు. కాగా..
 
ఈ లాటరీ టికెట్ ధర 500 దిర్హామ్‌(దాదాపు రూ. పది వేలు)లు. వెయ్య దిర్హామ్‌లు పెడితే ఒకేసారి మూడు టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో లేదా అబూధాబీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని లాటరీ స్టోర్లలో కూడా టికెట్లను కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.