శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr

ప్రచంచ చిత్రపటంలో ఉత్తర కొరియా ఉండదు... రష్యా

ప్రపంచ చిత్రపటంలో ఉత్తర కొరియా ఉండదని రష్యా అభిప్రాయపడింది. ఉత్తరకొరియాను నిస్సందేహంగా అమెరికా నాశనం చేస్తుందని రష్యా గట్టిగా భావిస్తోంది. అమెరికా చేసిన వ్యాఖ్యలపై తమకెలాంటి అనుమానమూ లేదని వెల్లడించిం

ప్రపంచ చిత్రపటంలో ఉత్తర కొరియా ఉండదని రష్యా అభిప్రాయపడింది. ఉత్తరకొరియాను నిస్సందేహంగా అమెరికా నాశనం చేస్తుందని రష్యా గట్టిగా భావిస్తోంది. అమెరికా చేసిన వ్యాఖ్యలపై తమకెలాంటి అనుమానమూ లేదని వెల్లడించింది. 
 
ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారి ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రపంచానికి ప్రమాదకరంగా తయారైన ఉత్తర కొరియాను సర్వనాశనం చేస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. 
 
దీనిపై రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గె లావరోవ్‌ స్పందించారు. ‘ఉత్తర కొరియాపై పలుమార్లు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను మేము విన్నాం. ఆ దేశాన్ని నాశనం చేయగల సామర్థ్యం అమెరికాకు ఉంది. అందులో మాకు ఎటువంటి అనుమానం లేదు.’ అని లావ్‌రోవ్‌ స్పష్టం చేశారు.