సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2022 (10:22 IST)

రష్యాపై ఆంక్షలు.. చమురు ఎగుమతులకు చెక్.. అది జరిగితే?

petrol pump
ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన నాటి నుంచి రష్యాకు కళ్లెం వేసేందుకు అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పాశ్చాత్య దేశాల నుంచి అనేక ఆంక్షలను ఎదుర్కొంటోంది. దీంతో పుతిన్ సర్కారు ఆర్థికంగానూ కొంత ఇబ్బందులకు గురవుతోంది. 
 
తాజాగా అయితే ఈ వేడిని మరింతగా పెంచేందుకు ఈయూ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇకపై రష్యా నుంచి దిగుమతి చేసుకునే చమురు ధరను ఒక్కో బ్యారెల్‌కు కేవలం 60 డాలర్లుగా నిర్ణయించేందుకు సిద్ధమైంది. 
 
క్రూడ్ ధరలను నియంత్రించడం యుద్ధాన్ని త్వరగా ముగించడంతో సాయపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధరల పరిమితిని నిర్ణయించకపోతే రష్యాకు లాభదాయకంగా వుంటుందని తెలిపారు. 
 
ధరల పరిమితి నిర్ణయిస్తే మిత్రదేశమైన భారత్‌కు సరసమైన ధరలకే చమురు సరఫరా చేసే అవకాశం వుంది. అలా జరిగితే దేశంలోని ప్రజలపై ధరల భారం పెరగదు. 
 
ప్రస్తుతం రష్యా రోజుకు 5 మిలియన్ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తోంది. ఈ ఆంక్షలు అమలులోకి వస్తే రష్యా తన చమురు ఎగుమతులు నిలిపివేసే ప్రమాదం కూడా ఉందని తెలుస్తోంది.