గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 నవంబరు 2022 (19:58 IST)

రష్యాకు చేరుకున్న పుష్ప బృందం .. సాదర స్వాగతం

Pushpa poster
పుష్ప బృందం రష్యాకు చేరుకుంది. ఈ సినిమా డిసెంబర్ 8న రష్యాలో విడుదల కానుంది. రష్యాలో పుష్ప చిత్ర ప్రమోషన్లలో వీరు హాజరుకాబోతున్నారు. ఇప్పటికే పుష్ప రష్యన్ ట్రైలర్ విడుదలైంది. రష్యా చేరుకున్న పుష్ప టీమ్‌కు సాదర స్వాగతం లభించింది. 
 
డిసెంబరు 1న మాస్కోలో, 3వ తేదీన సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పుష్ప ప్రీమియర్ షోలను ప్లాన్ చేశారు మేకర్స్. మాస్కోలో జరిగే ప్రీమియర్ షోలో అల్లు అర్జున్, రష్మికాతో పాటు దర్శకుడు సుకుమార్, నిర్మాత రవిశంకర్ పాల్గొంటారు.
 
సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పుష్ప సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేనీ, వై రవిశంకర్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. అల్లు అర్జున్, రష్మికా మందన్నా, ఫహాద్ ఫాజిల్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.