గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 నవంబరు 2022 (13:27 IST)

48,500 నాటి పురాతన zombie virus.. అంటువ్యాధిగా మారితే?

కరోనా నుంచే ఇంకా ప్రపంచ కోలుకోని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పడిప్పుడే కొన్ని దేశాలు కరోనాకు దూరంగా వున్నా.. చైనాలో ప్రస్తుతం కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే వున్నారు. ఈ నేపథ్యంలో మరో కొత్త వైరస్ ప్రపంచాన్ని భయపెట్టేందుకు వచ్చేస్తోంది. అది కూడా 48,500 ఏళ్లనాటి వైరస్ మళ్లీ పుట్టుకొచ్చింది. దీనిపేరు జాంబీ వైరస్. దీన్ని రష్యాలో గుర్తించారు. 
 
ఇది మహమ్మారిగా మారే అవకాశం వున్నట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇవే కాకుండా మరికొన్ని ప్రాణాంతక బ్యాక్టీరియాలను కనుగొన్నారు. ఇవి అంటు వ్యాధులుగా మారి ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం వుందని పరిశోధనలో వెల్లడి అయ్యింది. 48,500 నాటి జాంబీ వైరస్‌ను రష్యాలో గడ్డకట్టిన ఓ సరస్సు భాగాన వున్న వైరస్‌ను ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు బయటకు తీశారు. ఈ వైరస్ ఎలాంటి ప్రమాదాన్ని తెస్తుందోనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 
 
గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉతరార్థగోళంలో గడ్డకట్టుకుపోయి మంచు కారణంగా లక్షలాది సంవత్సరాల పాటు అందులో చిక్కుకున్న ఆర్గానిక్ పదార్థాలు బయటకు వచ్చే ప్రమాదం వుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వీటిలో పలు వైరస్‌లు వున్నట్లు గుర్తించారు. ఇవన్నీ పురాతనమైన వైరస్‌లుగా గుర్తించబడ్డాయి. 
 
ఇందులో పురాతనమైన వైరస్​ను 'పండోరావైరస్ యెడోమా'గా గుర్తించారు. దీన్ని 48,500 ఏళ్ల నాటిదిగా గుర్తించారు. మంచులో గడ్డకట్టుకుపోయి తిరిగి సాధారణ స్థితికి వచ్చిన వైరస్​లలో ఇదే అత్యంత పురాతనమైనది. 
 
ఇది ఇతర జీవులకూ సోకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ వైరస్ అంటువ్యాధిగా మారితే వైద్య పరమైన ప్రమాదానికి దారి తీయవచ్చునని తెలుస్తోంది. తాజా పరిశోధనలో 13 రకాల వైరస్‌లను శాస్త్రవేత్తలు గుర్తించారు.