ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2017 (12:47 IST)

అతిపెద్ద ఖండాంతర అణు క్షిపణి ప్రయోగానికి రష్యా సిద్ధం

రష్యా సరికొత్త ప్రయోగానికి సిద్ధంకానుంది. ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద ఖండాంతర అణుక్షిపణిని ప్రయోగించనుంది. శాటన్‌-2 పేరుతో ప్రయోగించే ఈ క్షిపణి సింగిల్‌ స్ట్రైక్‌తో అమెరికా రక్షణ వ్యవస్థను బద్దలు కొట్టగ

రష్యా సరికొత్త ప్రయోగానికి సిద్ధంకానుంది. ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద ఖండాంతర అణుక్షిపణిని ప్రయోగించనుంది. శాటన్‌-2 పేరుతో ప్రయోగించే ఈ క్షిపణి సింగిల్‌ స్ట్రైక్‌తో అమెరికా రక్షణ వ్యవస్థను బద్దలు కొట్టగలదని రష్యా చెబుతోంది. 40 మెగా టన్నులు బరువు గల డజను న్యూక్లియర్‌ వార్‌ హెడ్‌లను మోసుకెళ్లగల సామర్ధ్యం దీని సొంతంగా అభివర్ణించింది. 
 
ముఖ్యంగా, 1945లో అమెరికా హిరోషిమా, నాగసాకిలపై అమెరికా వేసిన ఆటం బాంబు కంటే శాటన్‌-2 దాదాపు 2 వేల రెట్లు శక్తిమంతమైనదిగా పేర్కొంది. ఈ క్షిపణిని ఈ యేడాది చివర్లో రష్యా ఈ ప్రయోగం చేపట్టనుంది. క్షిపణిని సర్వీసులోకి తీసుకునే ముందు ఇంతకుముందెన్నడూ లేనన్ని పరీక్షలు నిర్వహించాలనే యోచన చేస్తోంది. కాగా, శాటన్‌- 2 పరీక్ష ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఇందుకు కారణం తరచూ మిస్సైల్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడమే.