గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (12:12 IST)

2036 వరకూ రష్యా అధ్యక్షుడు పుతినే..!

2036 వరకూ రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ కొనసాగనున్నారు. మరో రెండుసార్లు అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు తనకు వీలు కల్పించే ఒక చట్టంపై వ్లాదిమిర్‌ పుతిన్‌ సోమవారం లాంఛనంగా సంతకం చేశారు. దీనివల్ల ఆయన 2036 వరకూ ఆ పదవిలోనే కొనసాగేందుకు వీలుంటుంది.

68 ఏళ్ల పుతిన్‌.. రెండు దశాబ్దాలకుపైగా రష్యాలో అధికారంలో ఉన్నారు. సోవియట్‌ పాలకుడు జోసెఫ్‌ స్టాలిన్‌ కన్నా ఎక్కువకాలం పాటు పుతిన్‌ పదవిలో కొనసాగారు. ఆయన ప్రస్తుత ఆరేళ్ల పదవీకాలం 2024లో ముగియనుంది. మళ్లీ అధ్యక్షుడిగా పోటీ చేయాలా.. వద్దా.. అనే విషయాన్ని తరువాత నిర్ణయిస్తానని పుతిన్‌ చెప్పారు.

రాజ్యాంగ సంస్కరణల్లో భాగంగా పుతిన్‌ తెచ్చిన ఈ ప్రతిపాదనకు మద్దతుగా గత ఏడాది జులైలో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటువేశారు. ఈ బిల్లుకు గత నెలలో చట్టసభ సభ్యులు మద్దతు పలికారు. దీంతో మరో రెండుసార్లు అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు వీలు కల్పించే చట్టంపై పుతిన్‌ సంతకం చేశారు.