సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 3 మే 2017 (14:31 IST)

అమెరికా, ఆస్ట్రేలియాల్లో జాత్యహంకారం.. ట్రంప్‌కు నిరసనగా చీర.. భారతీయులా వెళ్ళిపోండి..

అమెరికాలో జాత్యహంకారానికి పురుడు పోసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా.. ఓ అమెరికా యువతి చీరకట్టుతో దర్శనమిచ్చింది. భారతీయ వస్త్రధారణతో చీరల విశిష్టత తెలుపుతూనే సోషల్ మీడియా ద్వారా ట

అమెరికాలో జాత్యహంకారానికి పురుడు పోసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా.. ఓ అమెరికా యువతి చీరకట్టుతో దర్శనమిచ్చింది. భారతీయ వస్త్రధారణతో చీరల విశిష్టత తెలుపుతూనే సోషల్ మీడియా ద్వారా ట్రంప్ నిర్ణయాలకు నిరసన తెలుపుతోంది. ఈమె చేస్తున్న పోరాటంపై భారతీయులు సైతం మద్దతు తెలుపుతున్నారు. అభినందనలు తెలియజేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోకి షికాగోకు చెందిన స్టేసీ జాకబ్ 2015లో భారత దేశానికి విచ్చేశారు. చెన్నైలోని చేనేత వస్త్ర దుకాణాన్ని సందర్శించింది. అప్పటి నుంచి ఈమెకు చేనేత దుస్తులంటే ఎక్కువ ఇష్టం. అప్పటి నుంచి చేనేత చీరలకు, ఆమెకు మధ్య విడదీయలేని అనుబంధం ఏర్పడింది. అయితే, ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆమెకు నచ్చలేదు. దీంతో చీరకట్టుతో ఆమె తన నిరసన తెలియజేస్తోంది. ట్రంప్ తీసుకుంటున్న ఒక్కో నిర్ణయానికి ఒక్కోరకమైన చీరను ధరిస్తూ ఆమె నిరసన తెలుపుతోంది. 
 
అమెరికా తరహాలో ఆస్ట్రేలియాలో కూడా భారతీయులపై జాతి వివక్ష సంఘటనలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఏప్రిల్ 22న సిడ్నీలోని లూనా పార్క్‌‌కు ఉత్సవ్ పటేల్ తన గర్భవతి అయిన భార్య, నాలుగేళ్ల కుమార్తెతో కలిసి వెళ్లాడు. పార్కులో రైడింగ్ చేద్దామని తన నాలుగేళ్ల కుమార్తె కోరడంతో వెళ్లాలనుకున్నాడు.

అయితే గర్భవతి అయిన భార్యను అక్కడే కూర్చున్న ఓ ఆస్ట్రేలియన్ మహిళ వద్ద కూర్చోబెట్టాలనుకున్నాడు. అందుకు ఆమె అనుమతి అడిగాడు. అంతే ఆమె కోపంతో ఊగిపోయింది. ఎవరు మీరు అంటూ అడిగింది. భారతీయులమని చెప్పగానే ఛీ.. భారతీయులా అని వేలు చూపిస్తూ అనకూడని మాటలు అంది. పార్కు నుంచి వెళ్ళిపొమ్మంది. దీనికి సంబంధించిన వీడియోను ఉత్సవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆసీస్ మహిళకు వ్యతిరేకంగా నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది.