సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 7 జూన్ 2017 (15:12 IST)

తీవ్రవాదంపై పోరంటూ.. 14మంది పౌరులను ఉరితీయనున్న సౌదీ.. బలవంతంగా ఒప్పించి..

సౌదీ అరేబియాలో షియాలు అధికంగా ఉండే తూర్పు ప్రావిన్స్‌లో 2011 నుండి ఘర్షణలు జరుగుతున్నాయి. నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 2011-12ల్లో ఈ ప్రావిన్స్‌‌ల్లో జరిగిన నిరసనల్లో పాల్గొన్న 38మందిపై నిరసనలకు సంబం

సౌదీ అరేబియాలో షియాలు అధికంగా ఉండే తూర్పు ప్రావిన్స్‌లో 2011 నుండి ఘర్షణలు జరుగుతున్నాయి. నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 2011-12ల్లో ఈ ప్రావిన్స్‌‌ల్లో జరిగిన నిరసనల్లో పాల్గొన్న 38మందిపై నిరసనలకు సంబంధించిన అభియోగాలు రుజువైంది. ఇంకా వారిని దోషులుగా కోర్టు నిర్ధారించింది. ఇందులో 41మందికి మరణశిక్ష విధించినట్లు రెండు మానవ హక్కుల గ్రూపులకు అందుబాటులోకి వచ్చిన కోర్టు పత్రాల ద్వారా తెలిసింది.
 
వీరిలో చాలామంది జైళ్లల్లో మగ్గుతున్నారు. వీరిని తీవ్రవాదంపై పోరు పేరుతో తమ కక్షలు, ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు అధికారులు ఇలా మరణ శిక్షలను ఉపయోగించుకుంటున్నారని మానవ హక్కులవ సంస్థకు చెందిన సారా లే విట్సన్ ఆరోపించారు. 
 
వారు నేరం చేసినట్లు బలవంతంగా ఒప్పించారని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కి చెందిన లిన్ మాలాఫ్ తెలిపారు. సౌదీలో ఇలా ఈ ఏడాది మాత్రం 36 మందిని ఉరితీయగా రాజకీయ నిరసనలకు పాల్పడుతున్న వారికి తీవ్రవాదానికి మద్దతిచ్చే వారిగా, దేశాన్ని అస్థిరపరస్తున్న వారిగా సౌదీ సర్కారు అభివర్ణిస్తోందని లిన్ మాలాఫ్ వెల్లడించారు. ఇక తాజాగా రాజకీయ నిరసనల్లో పాల్గొన్న 14మందిని ఉరితీసేందుకు సౌదీ సర్కారు రెడీ అవుతోంది.