శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2024 (19:39 IST)

చరిత్రలో కనీవినీ ఎరుగని వాతావరణం.. సౌదీలో భారీ హిమపాతం

Saudi
Saudi
గల్ఫ్ దేశం సౌదీ అరేబియాలో చరిత్రలో కనీవినీ ఎరుగని విచిత్ర వాతావరణం ఏర్పడింది. గల్ఫ్ దేశం సౌదీ అరేబియాలో ఎండలు తీవ్రంగా ఉంటాయనే విషయం తెలిసిందే. కానీ అలాంటి ఎడారిలో   భారీగా హిమపాతం పడుతోంది. 
 
నేలపై తెల్లగా పేరుకుపోయిన మంచు స్థానికులను అమితాశ్చర్యానికి గురిచేస్తోంది. శీతాకాలం రాకముందే మంచు కురుస్తోందని స్థానికులు చెబుతున్నారు. 
 
కొన్ని ప్రాంతాల్లో ఇటీవల భారీగా వర్షాలు పడ్డాయని, ఇప్పుడు మంచు కురుస్తోందంటూ స్థానికులు పోస్టులు పెడుతున్నారు. అల్-జాఫ్ ప్రాంతంలో భారీ హిమపాతం నమోదవుతున్నట్టు చెబుతున్నారు.

నిజానికి అల్-జాఫ్ ప్రాంతం ఏడాదంతా పొడిగా ఉంటుంది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో హిమపాతానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.