సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 7 జులై 2016 (09:30 IST)

సౌదీలో ఘోరం: తల్లిని హతమార్చిన కవలలు.. ఐసిస్‌లో చేరొద్దన్నందుకు..?!

సౌదీలో ఘోరం జరిగింది. అల్లారుముద్దుగా పెంచిన కవలలే ఆ తల్లిని హతమార్చారు. సౌదీ రాజధాని రియాద్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరొద్దన్న పాపానికి తల్లితో పాటు తండ్రి, సోదరుడిని, మ

సౌదీలో ఘోరం జరిగింది. అల్లారుముద్దుగా పెంచిన కవలలే ఆ తల్లిని హతమార్చారు. సౌదీ రాజధాని రియాద్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరొద్దన్న పాపానికి తల్లితో పాటు తండ్రి, సోదరుడిని, మరో ఇద్దరు సోదరులు దారుణంగా హతమార్చేందుకు ఆ కవలలు ప్రయత్నించారు. ఈ ఘటన జూన్ 24న చోటు చేసుకుంది. 20 ఏళ్ల వయసు కలిగిన కవల సోదరులు ఖలీద్, సలేహ్ అల్-ఒరైనీ ఈ దురాగతానికి ఒడిగట్టారు. 
 
సిరియా వెళ్లిపోతామని.. ఐసిస్‌లో చేరిపోతామని ఆ కవలలు చెప్పడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో తల్లి హైలా(67)తో పాటు 73 ఏళ్ల వయసున్న తండ్రిని, 22 ఏళ్ల వయసున్న సోదరుడిపై కత్తితో దాడి చేశారు. తల్లి ప్రాణాలు కోల్పోగా.. తండ్రి, సోదరుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. సరిహద్దు దాటి యెమెన్‌కు పారిపోతుండగా ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐసిస్‌లో చేరొద్దన్నందుకు నిందితులు ఈ కిరాతకానికి ఒడిగట్టారని సౌదీ మీడియా తెలిపింది.