గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (20:49 IST)

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

snigdha
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి వరుసగా ఆయా బాధిత నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను చెబుతున్నారు. ఐతే కొంతమంది నటీమణులు మాత్రం తమకు బాల్యంలో ఎదురైన చేదు జ్ఞాపకాలను కూడా వెల్లడిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ నటీమణి స్నిగ్ద తనకు చిన్నతనంలో ఎదురైన ఘటనను చెప్పింది.
 
తను ఇందిరాపార్కులో ఆడుకుంటున్న సమయంలో ఓ ఆగంతకుడు తనను చెట్ల చాటుకి తీసుకుని వెళ్లి అత్యాచారం చేయబోయాడట. ఐతే ఎలాగో అక్కడి నుంచి బైటపడినప్పటికీ ఆ చేదు జ్ఞాపకాన్ని మరిచిపోయేందుకు తనకు 12 ఏళ్లకు పైగానే పట్టినట్లు చెప్పింది. అంతేకాదు.. ఈ ఘటన జరిగిన దగ్గర్నుంచి మగవాళ్లెవరైనా... ఆఖరికి తన తండ్రి, మామయ్యలైనా పక్కనే పడుకుంటే భయంతో వణికిపోయేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.
 
కాగా స్నిగ్ద అలా మొదలైంది చిత్రంతో మగవారి దుస్తులు వేసి అచ్చం మగవాడేమోనన్నట్లు ఆకట్టుకుంది. ఆ తర్వాత గుంటూరు టాకీస్, విజేత, కిట్టు వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.