బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 జూన్ 2018 (17:13 IST)

కట్టుబాట్లకు స్వేచ్ఛ : సౌదీలో అర్థరాత్రి కార్లు డ్రైవ్ చేస్తూ మహిళల సందడి

సౌదీ అరేబియాలో కట్టుబాట్లకు స్వేచ్ఛ వచ్చింది. సౌదీ మహిళలు అర్థరాత్రి కార్లు డ్రైవ్ చేసుకుంటూ రోడ్లపై చెక్కర్లు కొట్టారు. పైగా, రోడ్డుపై వెళ్లేవారికి గ్రీటింగ్స్ చెప్తూ ఎంజాయ్ చేశారు.

సౌదీ అరేబియాలో కట్టుబాట్లకు స్వేచ్ఛ వచ్చింది. సౌదీ మహిళలు అర్థరాత్రి కార్లు డ్రైవ్ చేసుకుంటూ రోడ్లపై చెక్కర్లు కొట్టారు. పైగా, రోడ్డుపై వెళ్లేవారికి గ్రీటింగ్స్ చెప్తూ ఎంజాయ్ చేశారు.
 
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దశాబ్దాలుగా సౌదీ అరేబియాలో మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఉంది. ఈ నిషేధం ఆదివారంతో అధికారికంగా ముగిసింది. దీంతో రాజధాని రియాద్‌లో శనివారం అర్థరాత్రే మహిళలు కారు డ్రైవింగ్‌ చేస్తూ రోడ్లపైకి చేరారు. తమకు స్వేచ్ఛ లభించినందుకు మహిళలు కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. 
 
సౌదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల్లో భాగంగా గత ఏడాది సెప్టెంబర్‌లో సౌదీ రాజు సల్మాన్‌ మహిళల డ్రైవింగ్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన విషయం తెల్సిందే. మహిళల డ్రైవింగ్‌ పై నిషేధం తొలగిపోవడంతో సౌదీలోని కొన్ని సంస్థలు తమ కంపెనీల్లో పనిచేస్తున్న మహిళలకు డ్రైవింగ్‌ శిక్షణ ఇప్పించేందుకు సన్నద్ధమవుతున్నాయి.