శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 5 జూన్ 2018 (16:56 IST)

డొనాల్డ్ ట్రంప్-కిమ్ భేటీకి ముహూర్తం ఖరారు.. వేదిక సింగపూర్..

ప్రపంచ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైంది. అవును.. ఆ ఇద్దరు కలుసుకోనున్నారు. వాళ్లిద్దరు ఎవరనేగా మీ సందేహం.. అయితే చదవండి మరి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కి

ప్రపంచ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైంది. అవును.. ఆ ఇద్దరు కలుసుకోనున్నారు. వాళ్లిద్దరు ఎవరనేగా మీ సందేహం.. అయితే చదవండి మరి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ భేటీకి ముహూర్తం ఖరారైంది. ఈ భేటీకి సంబంధించి వైట్ హౌస్ తొలిసారి అధికారిక ప్రకటన విడుదల చేసింది. 
 
సింగపూర్ వేదికగా ఈ నెల 12న ఉదయం 9 గంటలకు డొనాల్డ్ ట్రంప్- కిమ్ జాంగ్ ఉన్ సమావేశం ఉంటుందని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి సారా శాండర్స్ వెల్లడించారు. ఈ సమావేశానికి అమెరికా నుంచి భద్రతా బలగాలు సింగపూర్ వెళతాయని, ముందురోజు రాత్రి 9 గంటల నుంచే సమావేశం ప్రాంతం తమ అధీనంలో ఉంటుందని శాండర్స్ తెలిపారు. 
 
సానుకూల చర్చల మేరకు ఈ భేటీ వుంటుందని వైట్ హౌస్ అంచనా వేస్తోంది. ఉత్తర కొరియాను అణ్వస్త్ర రహిత దేశంగా మార్చడమే ప్రధాన అజెండాగా ట్రంప్ చర్చించనున్నారని శాండర్స్ వెల్లడించారు.