బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 29 మే 2017 (14:32 IST)

నిద్రలోనే శృంగారం.. భాగస్వాములను బలవంతం చేసి..?

స్లీపింగ్ బ్యూటీ అని పేరు తెచ్చుకున్న బ్రిటన్‌కి చెందిన లూసియా బాల్ అనే 22 ఏళ్ల యువతి.. కుంభకర్ణిడిలా ఆరు నెలలు కాకుండా 12 రోజుల పాటు నిద్రపోతోంది. రోజుకు 22 గంటలకు పైగా నిద్రపోయే ఈ యువతి మిగిలిన రెండ

స్లీపింగ్ బ్యూటీ అని పేరు తెచ్చుకున్న బ్రిటన్‌కి చెందిన లూసియా బాల్ అనే 22 ఏళ్ల యువతి.. కుంభకర్ణిడిలా ఆరు నెలలు కాకుండా 12 రోజుల పాటు నిద్రపోతోంది. రోజుకు 22 గంటలకు పైగా నిద్రపోయే ఈ యువతి మిగిలిన రెండు గంటలు కూడా మగత నిద్రలో వుంటుందట.

ఆ సమయంలోనే లూసియా బాల్‌కు ఆహారం ఇవ్వడం.. కాలకృత్యాలు వంటి అవసరాలు తీర్చాల్సి వస్తుందని ఆమె తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ నిద్రపోయే రోగం ద్వారా అమ్మాయి చదువు కోల్పోయిందని.. ప్రయాణాలు చేయలేకపోతుందని తల్లిదండ్రులు అంటున్నారు. ఈ నిద్రరోగానికి కచ్చితమైన వైద్యం లేదని డాక్టర్లు చెప్తున్నారు. 
 
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌కు చెందిన హేలీ బట్టీ అనే యువతి నిద్రలోనే శృంగారంలో పాల్గొంటుందట. తాను మాత్రం హ్యాపీగా నిద్రపోతూ.. ఆమె పక్కన నిద్రించే వారికి నిద్రలేకుండా చేస్తోంది. ఈ యువతి సెక్సోమ్నియా అనే విచిత్ర వ్యాధితో బాధపడుతోంది. ఈ సమస్య ఉన్నవారు నిద్రలోనే ఒకటికి నాలుగు సార్లు శృంగారంలో పాల్గొంటారట. భాగస్వాములను బలవంతం చేసి.. శృంగారంలో పాల్గొంటారట. 
 
నిద్ర నుంచి లేచిన తర్వాత ఏమీ జరగనట్లు వుంటారట. నిద్రలో ఏం చేశారనేది మరిచిపోతారట. ఈ రోగం వల్ల తనకు వచ్చిన సమస్య ఏమీ లేదని, కాకపోతే శృంగారంలో పాల్గొన్న అనుభూతి మాత్రం తనకు మిగలట్లేదని బట్టీ చెప్తోంది. తన కోసం కాకున్నా ప్రియుడి క్షేమం కోరి ఈ రోగానికి చికిత్స తీసుకుంటోందట. ప్రపంచ వ్యాప్తంగా ఈ ‘సెక్సోమ్నియా’ వ్యాధితో 11 శాతం మంది పురుషులు, 4 శాతం మంది స్త్రీలు బాధపడుతున్నారని సర్వేలో తేలింది.