శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 29 జులై 2017 (18:25 IST)

పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా షాహిద్ అబ్బాసీ ఖాకస్‌: సరిహద్దుల్లో భద్రత పెంచాల్సిందేనా?

పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా షాహిద్ అబ్బాసీ ఖాకస్‌ ఎంపికయ్యారు. పార్టీ సమావేశంలో షాహిద్ అబ్బాసీని ఆపద్ధర్మ ప్రధానిగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. 45 రోజుల పాటు ఆయన ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరిస్తారు. ఈల

పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా షాహిద్ అబ్బాసీ ఖాకస్‌ ఎంపికయ్యారు. పార్టీ సమావేశంలో షాహిద్ అబ్బాసీని ఆపద్ధర్మ ప్రధానిగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. 45 రోజుల పాటు ఆయన ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరిస్తారు. ఈలోగా షబాజ్ షరీఫ్ ఎంపీగా ఎన్నికైతే ఆయనను ప్రధానిగా ఎన్నుకోనున్నట్టు తెలుస్తోంది. 
 
కాగా, పాకిస్థాన్‌లో ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌పై అన‌ర్హ‌త వేటు విధించ‌డంతో ఏర్పడిన రాజకీయ పరిణామాలు భారత్‌పై ప్రభావం చూపుతుంది. ఒక‌వేళ అక్క‌డి ప్ర‌భుత్వం, మిల‌ట‌రీ క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేసేదైతే భ‌ద్ర‌త ప‌ర‌మైన ర‌క్ష‌ణ‌ను భార‌త్ క‌ట్టుదిట్టం చేయాల్సి ఉంటుంది.
 
పాక్ మాజీ ప్ర‌ధాని ష‌రీఫ్‌పై న‌రేంద్ర‌మోదీకి న‌మ్మ‌కం ఉండేది. కానీ ప‌ఠాన్‌కోట్‌, యూరీ ఘ‌ట‌న‌ల త‌ర్వాత ఆ నమ్మకం సన్నగిల్లింది. ఇలాంటి తరుణంలో పాకిస్థాన్ సర్కారు సైనిక ఆధిపత్యంలో ఉంటే మాత్రం సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేయాల్సి వుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.