గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2019 (13:46 IST)

ఒకటి కాదు.. నాలుగు లడ్డూలు కావాలా నాయనా?

అమ్మాయిలంటే పడి చస్తే మగాళ్ల సంఖ్య బాగానే పెరిగిపోతుంది. వారు ఎంత నిజాయితీగా వున్నారు. వారిలో మోసం దాగివుందా అనేది ఆలోచించకుండా.. అమ్మాయిల వెంట తిరిగి సర్వం కోల్పోయి లబోదిబో మన్న ఈ ఇరాక్ వ్యాపారవేత్త కథ ఇది. వివరాల్లోకి వెళితే.. వ్యాపారం నిమిత్తం  ఇరాక్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విజిట్ వీసాపై షార్జా వెళ్లాడు.
 
అతడికి ఆన్‌లైన్‌లో ఓ మహిళ పరిచయమైంది. ఆమె తనను తాను స్వీడిష్ విద్యార్థినిగా పరిచయం చేసుకుంది. ఆ పరిచయం కాస్తా ముదురుపాకాన పడటంతో ఇద్దరు ఓ ప్రదేశంలో కలిశారు. అతను బిజినెస్ పనిమీద దుబాయ్ వస్తున్నాడని తెలుసుకున్న మహిళ అతన్ని మాటల్లో పెట్టి అతనిదగ్గర డబ్బు భారీగా వుందన్న విషయాన్ని కనిపెట్టి, అల్ కోజ్‌లోని తన ఫ్లాట్‌కు ఆహ్వానించింది. 
 
ఫ్లాట్‌లో తాను ఒంటరిగానే ఉన్నానని వస్తే ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చని చెప్పింది. ఫ్రీగా ఇచ్చే ఆమె ఆఫర్‌ను ఎందుకు కాదనాలని ఆ కిలాడి ఫ్లాట్‌కు వెళ్లాడు. ఆ ఫ్లాట్‌‌లో అడుగుపెట్టిన అతనికి చుక్కెదురైంది. 
 
ఆ ఫ్లాట్‌లో ఆమెతో పాటు మరో నలుగురు మహిళలు ఉన్నారు. వారిని చూసిన వెంటనే తెగ సంతోషపడిన ఆ వ్యాపార వేత్తకు అసలు సంగతి అప్పుడే అర్థమైంది. ఆ ఐదుగురు ఆఫ్రికన్ మహిళలు గదిలో బంధించి, రూ.11లక్షల 24వేలు అతడి వద్ద నుంచి లాక్కున్నారు. 
 
అక్కడ నుంచి బతుకుజీవుడా అని బయటపడిన ఆ వ్యక్తి.. పోలీసులకు సమాచారం అందించి వారు వచ్చే వరకు భవనం బయట వేచి చూశాడు. పోలీసులు రాగానే యువతి ప్లాట్‌కు తీసుకెళ్లాడు. అయితే ఈలోపు ఇద్దరు మహిళలు అక్కడి నుంచి జంప్ అయ్యారు. 
 
దాంతో పోలీసులు మిగిలిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు.తాజాగా ముగ్గురు మహిళలను దుబాయి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఒక్కొక్కరికి మూడు నెలల చొప్పున జైలు శిక్ష వేసి,శిక్ష కాలం పూర్తైన వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించింది.