శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2019 (11:04 IST)

తల్లి కూలి పనికి వెళ్తే.. తండ్రి కన్నబిడ్డను ఏం చేశాడో తెలుసా?

బాలికలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కామాంధులు వయోబేధం లేకుండా విరుచుకుపడుతున్నారు. వావి వరుసలు కూడా మరిచిపోతున్నారు. తాజాగా ఓ తండ్రి కన్నబిడ్డపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తొమ్మిదేళ్ల కూతురిని ఇంట్లో ఉంచి తల్లి సోమవారం కూలి పనికి వెళ్లింది. సాయంత్రం సమయంలో మద్యం తాగి వచ్చిన తండ్రి షాదుల్‌ ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి కూలి పని ముగించుకుని రాత్రికి ఇంటికి వచ్చే సరికి కూతురు ఏడుస్తూ కనిపించింది. 
 
ఏం జరిగిందని ఆరా తీయగా బాలిక తండ్రి చేసిన అకృత్యాన్ని తెలిపింది. దీంతో బాధితురాలతో సహా ఆ తల్లి పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.