సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2019 (11:52 IST)

12ఏళ్ల బాలికపై రెండు నెలల పాటు టీచర్ అత్యాచారం.. గర్భం దాల్చడంతో?

ఉపాధ్యాయుడు కామాంధుడిగా మారిపోయాడు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కామంతో 12ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను గర్భవతిని చేశాడు. ఈ ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తెన్హిపాలెంలోని పాఠశాలలో బాలిక 7వ తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న 30 ఏళ్ల వ్యక్తి ఆమెను రెండు నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ క్రమంలో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులు ఆ బాలికను అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వెలుగులోకి వచ్చింది. వైద్యులు బాలిక గర్భంగా వుందని చెప్పడంతో.. ఆమె తల్లిదండ్రులు షాకయ్యారు. 
 
ఇంకా తల్లిదండ్రులతో ఆ బాలిక జరిగిన వ్యవహారమంతా చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.