బాలిక నుదుటిపై కుంకుమ పెట్టి.... నోట్లో నిమ్మకాయ కుక్కి పూజారి పాడు పని...

Last Modified గురువారం, 22 ఆగస్టు 2019 (17:37 IST)
దైవ సన్నిధానంలో వున్న ఆ పూజారి కామాంధుడయ్యాడు. నిత్యం దైవారాధనతో ఆధ్యాత్మిక సాగరంలో వుండాల్సిన ఆ పూజారి అడ్డదారి పట్టాడు. గుడికి దైవ దర్శనం కోసం వచ్చే యువతులపై కన్నేసి అడ్డంగా దొరికిపోయాడు. ఆ తర్వాత చిత్తుచిత్తుగా తన్నులు తిన్నాడు.

వివరాల్లోకి వెళితే... విజయవాడలోని ప్రకాష్‌ నగర్‌ హరిహర క్షేత్రానికి పక్కనే వున్న ఓ దేవాలయానికి మహిళలు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ ప్రతి శుక్రవారం పూజలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఇద్దరు అక్కా చెల్లెళ్లు గత శుక్రవారం ఈ గుడిలో పూజ చేసేందుకు వచ్చారు. అందులో భాగంగా వారు హోమ గుండం వద్ద కూర్చుని వుండగా అక్కడికి పూజారి వచ్చాడు.

తను మంత్రోపదేశం చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని వారిని నమ్మించాడు. నీ చెల్లిని పంపిస్తే మంత్రం చెప్పి పంపిస్తానని ఆమె సోదరితో చెప్పి బాలికను గుడి పక్కనే వున్న గదిలోకి తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత ఆ బాలిక నుదుటిపై బొట్టు పెట్టి నోట్లో నిమ్మకాయ పెట్టాడు. ఇక ఆ తర్వాత ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు.

ఆలయంలోకి వెళ్లిన తన చెల్లి ఎంతకీ తిరిగి రాకపోయేసరికి అనుమానం వచ్చిన ఆమె సోదరి లోపలికి వెళ్లి గది తలుపు తీసింది. అంతే... ఆ పూజారి చేస్తున్న అకృత్యాన్ని చూసి షాక్ తిన్నది. తన చెల్లిని తీసుకుని ఇంటికెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు ఆదివారంనాడు చెప్పింది. అప్పటికే ఆ బాలిక జరిగిన ఘటనతో షాక్ చెంది జ్వరంతో అల్లాడిపోయింది.

కాగా బాధితురాలి పేరెంట్స్‌తో పాటు ఇరుగుపొరుగువారు కలిసి ఆలయ పూజారి వద్దకెళ్లి అతడిని చితక బాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.దీనిపై మరింత చదవండి :