శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 7 ఆగస్టు 2017 (22:19 IST)

బోయ్ ఫ్రెండ్‌తో నాలుగేళ్లు... కిడ్నీ సమస్యని వెళితే బిడ్డను కంటావనీ...

ఆమె తన బోయ్ ఫ్రెండుతో నాలుగేళ్లుగా వుంటోంది. ఈ క్రమంలో ఆమెకు ఆమధ్య మూత్రపిండాలకు సంబంధించిన సమస్య రావడంతో దానికి ట్రీట్మెంట్ తీసుకుంది. ఆ తర్వాత మళ్లీ ఈమధ్య సమస్య వున్నట్లుగా అనిపించి వైద్యుడి వద్దకు వెళ్లింది. ఐతే ఆమె షాకయ్యే వార్త చెప్పాడు డాక్టర్.

ఆమె తన బోయ్ ఫ్రెండుతో నాలుగేళ్లుగా వుంటోంది. ఈ క్రమంలో ఆమెకు ఆమధ్య మూత్రపిండాలకు సంబంధించిన సమస్య రావడంతో దానికి ట్రీట్మెంట్ తీసుకుంది. ఆ తర్వాత మళ్లీ ఈమధ్య సమస్య వున్నట్లుగా అనిపించి వైద్యుడి వద్దకు వెళ్లింది. ఐతే ఆమె షాకయ్యే వార్త చెప్పాడు డాక్టర్. అదేంటంటే... ఆమె మరో 24 గంటల్లో బిడ్డను ప్రసవించబోతోందని. అదెలా జరిగిందో ఆమెకు అంతుపట్టలేదు. 
 
ఇంగ్లండుకు చెందిన కాటీ ఓబ్రీన్ అనే యువతి కాస్త నలతగా వుందని వైద్యుడిని సంప్రదిస్తే కడుపులో బిడ్డ వుందని చెప్పడమే కాకుండా 24 గంటల్లో ప్రసవిస్తావని చెప్పాడు. కానీ తనకు 9 నెలల కాలంలో ఏనాడు తన కడుపులో బిడ్డ పెరుగుతున్న ఫీలింగ్ లేదనీ, పైగా తన బోయ్ ఫ్రెండుతో నాలుగేళ్లపాటు శృంగారం చేస్తున్నప్పటికీ ఏరోజు కూడా గర్భనిరోధక పద్ధతిని పాటించకుండా పాల్గొనలేదని ఆమె వెల్లడించింది. ఏదేమైనప్పటికీ శృంగారంలో ఎక్కడో చేసిన చిన్న పొరపాటుకు మీరు తల్లిదండ్రులయ్యారంటూ వైద్యుడు చెప్పాడట.