గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2017 (11:00 IST)

న్యూస్‌రూమ్‌లోకి పాము వచ్చింది.. ఓ మహిళా ఉద్యోగి ఆ పామును ఏం చేసిందంటే?

ఓ ఛానల్ న్యూస్‌రూమ్‌లోకి ఓ పాము వచ్చింది. అనుకోని అతిథి వచ్చిన విషయాన్ని గమనించలేదని.. కంప్యూటర్ టేబుల్‌పైకి ఎక్కి స్పీకర్ల వెనక నక్కింది. దాన్ని గుర్తించి ఉద్యోగులు జడుసుకోకుండా సంచిలో కుక్కి మర్యాద

ఓ ఛానల్ న్యూస్‌రూమ్‌లోకి ఓ పాము వచ్చింది. అనుకోని అతిథి వచ్చిన విషయాన్ని గమనించలేదని..  కంప్యూటర్ టేబుల్‌పైకి ఎక్కి స్పీకర్ల వెనక నక్కింది. దాన్ని గుర్తించి ఉద్యోగులు జడుసుకోకుండా సంచిలో కుక్కి మర్యాదలు చేసి పంపారు. ఆస్ట్రేలియాలోని ‘9 న్యూస్‌ డార్విన్‌’ న్యూస్‌ ఛానల్‌ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. డార్విన్ ఛానల్ కార్యాలయంలోకి ఓ పాము ఎక్కడి నుంచి వచ్చింది.
 
కంప్యూటర్‌ డెస్క్‌పైకి ఎక్కి సౌండ్‌ బాక్స్‌ల వెనకకు చేరింది. దీన్ని మొదటగా ఓ కెమెరాపర్సన్ గమనించి ఇతరులకు సమాచారం అందించాడు. ఇంతలో పాములు పట్టడంలో నైపుణ్యం కలిగిన ఓ మహిళా ఉద్యోగి ధైర్యంగా ముందుకు వచ్చి ఆ సర్పాన్ని చేతితో అక్కడి నుంచి లాగింది. 
 
మరో ఉద్యోగి దాన్ని సంచిలో పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆ పాము మహిళా ఉద్యోగిపై ఎగిరేందుకు ప్రయత్నించింది. అయినా ఆ ఉద్యోగి ఏమాత్రం జడుసుకోకుండా సంచిలోకి కుక్కింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.