శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2017 (14:59 IST)

అబ్బే.. శ్వేతసౌధంలో చీమలు, బొద్దింకలా.. మెస్‌లో ఎలుకలు కూడానా?

అగ్రరాజ్యం అంటేనే శ్వేతసౌధం గుర్తుకువస్తుంది. తెలుపు రంగున కనిపించే వైట్‌హౌస్‌లో శుభ్రతకు ప్రతీక. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాలుమోపిన ప్రస్తుత వైట్ హౌస్‌ వార్తల్లో నిలిచింది. అమెరికా అధ

అగ్రరాజ్యం అంటేనే శ్వేతసౌధం గుర్తుకువస్తుంది. తెలుపు రంగున కనిపించే వైట్‌హౌస్‌లో శుభ్రతకు ప్రతీక. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాలుమోపిన ప్రస్తుత వైట్ హౌస్‌ వార్తల్లో నిలిచింది. అమెరికా అధ్యక్షుడి భవనం అయిన వైట్ హౌస్‌ ప్రస్తుతం చీమలు, బొద్దింకలు, ఎలుకలకు నివాసంగా మారిందని సమాచారం. ఇటీవల 2017 వర్కింగ్ ఆర్డర్ల డాక్యుమెంట్ల ద్వారా ఈ విషయం తెలిసింది. 
 
వైట్ హౌస్‌లోని గదుల నిర్వహణ, మరమ్మత్తుల కోసం అధికారులు యూఎస్ జ‌న‌ర‌ల్ స‌ర్వీసెస్ అడ్మినిస్ట్రేష‌న్ (జీఎస్ఏ)కి వంద‌లసంఖ్య‌లో ద‌ర‌ఖాస్తులు పెట్టుకున్న‌ప్ప‌టికీ ప‌ట్టించుకోనట్ల సమాచారం. ఏజెన్సీ రికార్డుల ప్ర‌కారం వైట్‌హౌస్ మ‌రమ్మ‌తులు, నిర్వ‌హ‌ణ కోసం జీఎస్ఏ సంవ‌త్స‌రానికి ల‌క్ష డాల‌ర్లు ఖ‌ర్చు పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. అధ్యక్షుడి అధికారిక నివాసంలోని దాదాపు నాలుగు ప్రాంతాల్లో చీమల బెడదల వుంగని, నావీ మెస్‌లో ఎలుకలు కూడా వున్నట్లు డాక్యుమెంట్లలో వుంది.